BPCL యొక్క పాక్షిక ప్రైవేటీకరణ... తోసిపుచ్చిన కేంద్రం

ABN , First Publish Date - 2022-05-18T23:39:21+05:30 IST

BPCL పాక్షిక ప్రైవేటీకరణను కేంద్రం పరిగణించడం లేదని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.BPCL డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను ప్రభుత్వం మళ్లీ పరిశీలిస్తోంది.

BPCL యొక్క పాక్షిక ప్రైవేటీకరణ...  తోసిపుచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ : BPCL పాక్షిక ప్రైవేటీకరణను కేంద్రం పరిగణించడం లేదని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.BPCL డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను  ప్రభుత్వం మళ్లీ పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధఇంచిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మునుపటి సందర్భాలలో మోడల్ ఫలితాలను అందనందున తాము BPCL పాక్షిక ప్రైవేటీకరణను పరిగణించడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకే బిడ్డర్ పరిస్థితి ఉన్నందున BPCL డిజిన్వెస్ట్‌మెంట్ రద్దైన విషయం తెలిసిందే. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ(MoPNG) కూడా 2023 ఏప్రిల్ 1 నుండి దేశంలోని ఎంపిక చేసిన పెట్రోల్ పంపుల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనం లభ్యమయ్యే స్థితిని చేరుకోవడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలోనే... బీపీసీఎల్ ప్రైవేటీకరణ ప్రక్రియ లేదంటూ కేంద్రం చెబుతోందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. 


ఇదిలా ఉండగా... బీపీసీఎల్ ను పాక్షికంగా ప్రైవేటీకరించే విషయమై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సంనబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో... ఎక్కువ సంఖ్యలో బిడ్డర్లు వచ్చేలా నోటిఫికేషన్ లను జారీ చేయాలన్న దిశగా కసరత్తు జరుగుతున్నట్లు వినవస్తోంది. ఇందులో భాగంగా సంబంధఇత ప్రతిపాదనల్లో సవరణలు చోటుచేసుకోనున్నట్లు భావిస్తున్నారు.   

Updated Date - 2022-05-18T23:39:21+05:30 IST