ఆక్సిజన్‌ ట్యాంకర్లకు ‘టోల్‌’ మాఫీ

May 9 2021 @ 00:46AM

న్యూఢిల్లీ: ద్రవరూప ఆక్సిజన్‌ను రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లకు టోల్‌ చార్జీల నుంచి  మినహాయింపునిస్తున్నట్లు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది. కరోనా కాలంలో ఆక్సిజన్‌కు అసాధారణ డిమాండ్‌ నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరో రెండు నెలల వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ప్రాణవాయువును రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లను సైతం అంబులెన్స్‌ తరహా అత్యవసర వాహనంగా పరిగణించడం జరుగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.