రైతులతో తక్షణమే బేషరతుగా చర్చలు జరపాలి: కేజ్రీవాల్ డిమాండ్

ABN , First Publish Date - 2020-11-30T02:42:17+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై ...

రైతులతో తక్షణమే బేషరతుగా చర్చలు జరపాలి: కేజ్రీవాల్ డిమాండ్

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బేషరతుగా రైతులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తక్షణమే బేషరతుగా రైతులతో చర్చలు జరపాలి...’’ అని ఢిల్లీ సీఎం ట్వీట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని సింఘు, టిక్రి బోర్డర్ పాయింట్ల వద్ద రైతులు చేపట్టిన ఆందోళన ఇవాళ నాలుగో రోజుకు చేరింది. రైతుల ఆందోళనకు ఢిల్లీ అధికార పార్టీ ఆమాద్మీ పార్టీ మద్దతు తెలిపింది. లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల వద్ద చర్చల కోసం ఎదురుచూస్తుంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి ‘‘తీవ్ర నిర్లక్ష్యం’’ ప్రదర్శించారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఓ వైపు రైతులు గుమిగూడితే కరోనా వైరస్ ప్రబలుతుందని చెబుతున్న అమిత్ షా... మరోవైపు హైదరాబాద్‌లో ‘‘కనీసం సామాజిక దూరం లేకుండా’’ భారీ రోడ్‌షోలు నిర్వహించారని ఆయన విమర్శించారు.

Updated Date - 2020-11-30T02:42:17+05:30 IST