Kerala: నిపావైరస్ నివారణకు చర్యలు తీసుకోండి: కేంద్రం సూచన

ABN , First Publish Date - 2021-09-07T13:25:07+05:30 IST

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది....

Kerala: నిపావైరస్ నివారణకు చర్యలు తీసుకోండి: కేంద్రం సూచన

న్యూఢిల్లీ : కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళలో వ్యాప్తిచెందుతున్న నిపా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కేరళ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీపీ జాయ్ కు లేఖ రాసింది.నిపావైరస్ నివారణకు ఆసుపత్రి, కమ్యూనిటీ ఆధారిత నిఘాను బలోపేతం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ కేరళ అధికారులను ఆదేశించింది.నిపావైరస్ సోకిన 12 ఏళ్ల బాలుడి కాంటాక్టు జాబితాలో 251 మందిని కేంద్ర అధికారుల బృందం గుర్తించింది. ఇందులో 11 మంది నిపావైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు.నిపావైరస్ బాలుడి పరిచయ జాబితాలో 129 ఆరోగ్య కార్యకర్తలున్నారు. 


వారిలో 54 మంది హైరిస్క్ కేటగిరిలో ఉన్నారు.కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నిపావైరస్ బారిని పడి మరణించిన బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు.నిపా వైరస్ కు తోడు కేరళలో కరోనా విజృంభిస్తుండటంతో గత 6 నెలల్లో నలుగురు పిల్లలు మరణించారు.కన్నూర్, మలప్పురం, వయనాడ్ జిల్లాలను అప్రమత్తం చేసి నిపావైరస్ కంటైన్మెంట్ ఏరియాలో రోగులను శోధించాలని కేంద్రం కేరళ అధికారులను ఆదేశించింది.నిపావైరస్ పై 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. కేరళ సర్కారుకు కేంద్రం అన్ని రకాల సాంకేతిక సహకారాన్ని ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.నిపావైరస్ పెంపుడు జంతువులకు సోకకుండా కేరళ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తం కావాలని కేంద్రం కోరింది.


Updated Date - 2021-09-07T13:25:07+05:30 IST