sedition law పున:పరిశీలిస్తాం: Supreme Courtలో కేంద్రం పిటిషన్..

ABN , First Publish Date - 2022-05-09T22:26:02+05:30 IST

న్యూఢిల్లీ : రాజద్రోహ చట్టం(sedition law) విషయంలో Central Govt యూ-టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. చట్టంలోని నిబంధనల(సెక్షన్ 214ఏ)ను పున:పరిశీలిస్తామని, మార్పులకు అవకాశముందని సర్వో

sedition law పున:పరిశీలిస్తాం: Supreme Courtలో కేంద్రం పిటిషన్..

న్యూఢిల్లీ : రాజద్రోహ చట్టం(sedition law) విషయంలో Central Govt యూ-టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. చట్టంలోని నిబంధనల(సెక్షన్ 214ఏ)ను పున:పరిశీలిస్తామని, మార్పులకు అవకాశముందని సర్వోన్నత న్యాయస్థానం Supreme court కు వెల్లడించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలనకు తీసుకోవద్దని కోరింది. కేంద్ర ప్రభుత్వం మార్పుల కసరత్తును పూర్తి చేసేంతవరకు వేచివుండాలని విజ్ఞప్తి చేసింది. కాగా రాజద్రోహ చట్టాల రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మే 10 నుంచి వింటామని గతంలో సుప్రీంకోర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి పిటిషన్లు విననున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది.


3 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. కాలం చెల్లిన చట్టాలను తొలగించడంతోపాటు దేశ సౌర్వభౌమత్వం, రక్షణకు కట్టుబడి ఉన్నామని అఫిడవిట్‌లో పేర్కొంది. దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మూలనపడేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ ముందు ఈ అఫిడవిట్‌ను సమర్పించింది.

Read more