పతకాలలో సెంచరీ కొట్టింది!

ABN , First Publish Date - 2021-03-26T05:30:00+05:30 IST

స్కూల్లో రకరకాల పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకోవడం అందరికీ అనుభవమే. కానీ పశ్చిమబెంగాల్‌లోని

పతకాలలో సెంచరీ కొట్టింది!

స్కూల్లో రకరకాల పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకోవడం అందరికీ అనుభవమే. కానీ పశ్చిమబెంగాల్‌లోని మెదినీపూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల సమ్రిద్ధి మాత్రం పతకాలు గెలుచుకోవడంలో సెంచరీ కొట్టింది.


స్కూల్లో జరిగే పోటీలే కాకుండా, జిల్లాల్లో, రాష్ట్రంలో ఎక్కడ పోటీలు జరిగినా సమ్రిద్ధి పోటీ చేస్తుంది. తను పోటీ చేసిందంటే మొదటి మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుంది.


అలా ఇప్పటివరకు వంద సర్టిఫికెట్లను సొంతం చేసుకుంది. డ్రాయింగ్‌ పోటీల్లో 58, డ్యాన్స్‌ 5, పాటల పోటీల్లో రెండు, పారాయణం పోటీల్లో 35 పతకాలు గెలుచుకుంది. 


కొన్ని జాతీయ స్థాయి పోటీల్లో గెలుచుకుంటే మరికొన్ని రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పోటీలు ఉన్నాయి. అంతేకాదు రకరకాల పోటీల్లో అత్యథిక పతకాలు గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించింది.

Updated Date - 2021-03-26T05:30:00+05:30 IST