
తిరుమల: తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించి మంత్రి వేణుగోపాలకృష్ణ వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలను మంత్రి జరుపుకున్నారు. అయితే తిరుమలలో కేక్ కట్ చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. స్థానికులు కేక్ తెచ్చుకున్నా కట్ చేయడానికి నిబంధనల పేరిట భద్రతా సిబ్బంది అనుమతివ్వదు. అలాంటిది మంత్రి జన్మదిన వేడుకలను తిరుమలలో జరుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి