వీణల తయారీపై సర్టిఫికెట్‌ కోర్సు

ABN , First Publish Date - 2020-11-30T04:55:55+05:30 IST

వీణల తయారీపై సర్టిఫికెట్‌ కోర్సును ప్రవేశపెట్టి బొబ్బిలి వీణలకు మరింత ఖ్యాతి తెచ్చేందుకు కృషి చేస్తామని గిరిజన విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్‌ కట్టమణి తెలిపారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలోని వీణల తయారీ కేంద్రాన్ని (క్రాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటరు) ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వీణల తయారీ కళాకారుల జీవన స్థితిగతులను, వీణల తయారీ విధానాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

వీణల తయారీపై సర్టిఫికెట్‌ కోర్సు
వీణలతయారీని పరిశీలిస్తున్న వైస్‌చాన్సలర్‌

 గిరిజన యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌

వీణల కేంద్రాన్ని సందర్శించిన కట్టమణి

బొబ్బిలి, నవంబరు 29:

వీణల తయారీపై సర్టిఫికెట్‌ కోర్సును ప్రవేశపెట్టి బొబ్బిలి వీణలకు మరింత ఖ్యాతి తెచ్చేందుకు కృషి చేస్తామని గిరిజన విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్‌ కట్టమణి తెలిపారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలోని వీణల తయారీ కేంద్రాన్ని (క్రాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటరు) ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వీణల తయారీ కళాకారుల జీవన స్థితిగతులను, వీణల తయారీ విధానాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నిర్వాహకుడు అచ్చుత నారాయణ ఆయనకు కూలంకుషంగా వివరించారు. పనస కలపతో ఎటువంటి అతుకులు లేకుండా ఏకండి కర్రను ఉపయోగించి వీణలను తయారు చేయడం తమ ప్రత్యేకత అని తెలిపారు. కరోనా కాలంలో గిరాకీ లేకపోవడంతో కళాకారులు తమ జీవనానికి ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలో నైపుణ్యాలు పెంచేందుకు కేరళకు చెందిన టూరిజం శాఖ వారు ఇటీవల శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చారన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానం, గవర్నర్‌ కార్యాలయాల్లో అతిథులకు ఇచ్చేందుకు తాము తయారు చేసే గిఫ్ట్‌ వీణలను హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్డర్లు ఇచ్చారని, ఆయా ఆర్డర్ల ప్రకారం వీణలను తయారు చేసి ఇస్తున్నామన్నారు. అనంతరం వీసీ కట్టమణి మాట్లాడుతూ వీణల తయారీపై తమ విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్‌ కోర్సును ప్రవేశపెడతానని చెప్పగానే వారంతా హర్షం వ్యక్తం చేశారు. వైస్‌చాన్సలర్‌ వెంట అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి డాక్టర్‌ ఎన్‌వియెస్‌ సూర్యనారాయణ, ఐటీడీఏ ఇంజనీరు జి.తిరుపతిరావు ఉన్నారు.


Updated Date - 2020-11-30T04:55:55+05:30 IST