బొమ్మవరం చెరువులో ఆగని మట్టి తరలింపు
ABN , First Publish Date - 2022-08-16T03:47:56+05:30 IST
రెండు రోజులుగా మండలంలోని బొమ్మవరం చెరువులో రాత్రిపూట అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఇటుక బట్టీలకు తరలిస్తున్నా
అనంతసాగరం, ఆగస్టు 15: రెండు రోజులుగా మండలంలోని బొమ్మవరం చెరువులో రాత్రిపూట అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. అయాని పట్టించుకునేవారు కరవయ్యారు. మర్రిపాడు మండలానికి చెందిన ఓ వైసీపీ నేత కనుసన్నల్లో మట్టి దోపిడీ జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. తొలి రోజు శనివారం తవ్వకాలను అగ్రహారం గ్రామస్థులు అడ్డుకొన్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటక మట్టి తరలింపు కొనసాగింది. ఇకనైనా ఉన్నతాధికారులు ఈవిషయంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.