నువ్వుల పులావు

ABN , First Publish Date - 2021-04-17T17:46:44+05:30 IST

మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, శనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి - మూడు, కరివేపాకు - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, నువ్వులు - మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఎండుకొబ్బరి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, ఆవాలు

నువ్వుల పులావు

కావలసినవి: మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, శనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి - మూడు, కరివేపాకు - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, నువ్వులు - మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఎండుకొబ్బరి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, ఆవాలు - పావు టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, బియ్యం - ఒకటిన్నర కప్పు.


తయారీ విధానం: ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండి సిద్ధంగా పెట్టుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ఎండుకొబ్బరి వేసి కలపాలి. కాసేపు వేగించి దింపాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై మళ్లీ పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి. మినప్పప్పు వేగిన తరువాత కరివేపాకు, ఇంగువ వేసుకుని దింపాలి. ఇందులో నువ్వుల పొడి, తగినంత ఉప్పు వేయాలి. వండి అన్నం తీసుకుని అందులో ఈ మిశ్రమం కావలసినంత వేసుకుని కలపాలి. రుచికరమైన ఈ నువ్వుల పులావును ఇతర కూరలతో లేదా పెరుగుతో సర్వ్‌ చేయాలి.


Updated Date - 2021-04-17T17:46:44+05:30 IST