చాట్ వివాదంతో చాచా ట్రెండ్... ఫన్నీ మీమ్స్ వెల్లువ!

ABN , First Publish Date - 2021-02-24T14:34:43+05:30 IST

యూపీలోని బాగ్‌పత్‌ మార్కెట్‌లో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం...

చాట్ వివాదంతో చాచా ట్రెండ్... ఫన్నీ మీమ్స్ వెల్లువ!

బాగ్‌పత్: యూపీలోని బాగ్‌పత్‌ మార్కెట్‌లో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు చాట్ దుకాణదారుల మధ్య చోటుచేసుకున్న వివాదం కర్రలతో కొట్టుకునే వరకూ దారి తీసింది. అయితే ఈ గొడవల్లో తలదూర్చిన ఒక చాచా తన విచిత్ర హెయిర్ స్టయిల్‌తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. 


దీంతో చాచా ట్రెండ్ క్రియేట్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ నటి రుచా చడ్డా షేర్ చేస్తూ ఏదైనా షోలో ఏదోఒక నగరంలో నేరం జరిగినట్టు చూపిస్తే, ఆ నగరంలోని వారు తప్పుపడతారు. అదే వాస్తవ దృశ్యాలు చూపించినప్పుడు కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తుంటారు. ఇలా చాలా విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయని పేర్కొన్నారు. కాగా కొందరు నెటిజన్లు చాచాను ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ రూపంతో పోలుస్తున్నారు.

Updated Date - 2021-02-24T14:34:43+05:30 IST