సచివాలయాల్లో ఆధార్‌ సేవలు

ABN , First Publish Date - 2022-06-30T03:46:37+05:30 IST

‘ఆధార్‌’ లేనిదే ఏ మనిషి మనుగడ సాగించలేని పరిస్థితి.

సచివాలయాల్లో ఆధార్‌ సేవలు
సచివాలయంంలో బాలుడికి ఆధార్‌ నమోదు చేస్తున్న సిబ్బంది

తీరనున్న ప్రజల ఇబ్బందులు

కలిగిరి, జూన్‌ 29 ‘ఆధార్‌’ లేనిదే ఏ మనిషి మనుగడ సాగించలేని పరిస్థితి. పుట్టినప్పటి నుంచి జీవించి ఉన్నత కాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల లబ్ధి నుంచి, విద్యాభ్యాసం, ఉద్యోగం ఇలా వివిధ స్థాయిల్లో ప్రతి దానికి ఆధార్‌ అవసరం. సుమారు 13 ఏళ్ల క్రితం వాడుకలోకి వచ్చిన ఆధార్‌ ప్రస్తుతం ప్రధాన గుర్తింపు కార్డుగా మారింది. అయితే రెండేళ్ల క్రితం మీ-సేవ కేంద్రాల్లో నడుస్తున్న ఆధార్‌ నమోదు కేంద్రాలను దాదాపు 90 శాతానికిపైగా నిలిపేశారు. అప్పటి నుంచి ప్రైవేటు ఏజెన్సీల ద్వారా పోస్టాఫీసులు, బ్యాకుల్లో ఆధార్‌ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సదుపాయం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో ఆధార్‌ సేవలను ప్రారంభించడంతో దూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ తప్పి స్థానికంగానే ఆధార్‌ సేవలు అందుతుండడంతో ప్రజలు ఊరట చెందుతున్నారు.


Updated Date - 2022-06-30T03:46:37+05:30 IST