HYD: చైన్‌ స్నాచర్‌ ఆటకట్టు

ABN , First Publish Date - 2022-01-23T19:57:40+05:30 IST

చైన్ స్నాచింగ్‌లకు తెగబడుతున్న నిందితుడి ఆట కట్టించారు పోలీసులు.

HYD: చైన్‌ స్నాచర్‌ ఆటకట్టు

హైదరాబాద్: చైన్ స్నాచింగ్‌లకు తెగబడుతున్న నిందితుడి ఆట కట్టించారు పోలీసులు. గంట వ్యవధిలోనే ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ చేసి పోలీసులకు సవాల్ విసిరాడు. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే రోజు గంటల వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి నగర వాసులను హడలెత్తించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ పుటేజ్ ద్వారా చైన్ స్నాచర్‌ను గుర్తించిన పోలీసులు.. నిందితుడు గుజరాత్‌కు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసుల సాయంతో నిందితుడి ఆచూకి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-01-23T19:57:40+05:30 IST