Advertisement

మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ

Sep 23 2020 @ 01:48AM

జక్రాన్‌పల్లి, సెప్టెంబరు 22: ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..  44వ జాతీయరహదారి పక్కన వ్యవసాయ తోటలో జక్రాన్‌పల్లి గ్రామానికి చెం దిన ఎం.గంగనర్సు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. ఇంతలోనే గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై తోటలోకి వచ్చారని, మెడపై కత్తిపెట్టి రెండు తులాల ఐదు మాసాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లారని బా ధితులు తెలిపింది. వెంటనే ఘటన స్థలానికి డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్‌లు, ఎస్సై సాయిరెడ్డి అక్కడికి చేరుకొని బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us on:
Advertisement
Advertisement