
తడబడ్డ సభాపతి తమ్మినేని
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): సభాపతి తమ్మినేని సీతారాం మాట తడబడి, సర్దుకున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘కొవిడ్‌కు సంబంధించి మన సీఎం తీసుకుంటున్న చర్యలను మనం తప్పకుండా ప్రశంసించకుండా ఉండలేం. చాలా గొప్పదైన కాన్సెప్ట్... ఈ వలంటీర్స్, సెక్రటేరియెట్ కాన్సె్‌ప్టల ద్వారా ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేపట్టే కొవిడ్ నివారణా చర్యలను తీసుకుని వెళ్లగలిగే ఒక అద్భుతమైనటువంటి యంత్రాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇట్ ఈజ్ యీల్డిండ్ వెరీగుడ్ రిజల్ట్స్. ప్రజలు ప్రభుత్వ పనితీరును నమ్ముతున్నారు. చంద్రబాబు నాయు డు డైనమిక్ స్టీవర్డ్‌షి్‌పపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు... మన జగన్మోహనరెడ్డిగారు... ఆ ప్రయత్నంలో మనం వెళ్లాలని నేను కోరుకుంటున్నా’’ అని అన్నారు. సభాపతి నోట చంద్రబాబు సమర్థ నాయకత్వం అని రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.