అందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ABN , First Publish Date - 2021-07-29T05:35:50+05:30 IST

అందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

అందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను అందజేస్తున్న చల్లా ధర్మారెడ్డి

- సొంత స్థలంలో నిర్మించుకునేందుకు నిధులు  

- ‘ఆత్మకూరు’ను వరంగల్‌ జిల్లాలోనే   కొనసాగింపు..

- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఆత్మకూరు, జూలై 28 : నిరు పేదలందకీ డబుల్‌ బెడ్‌రూం పథకంలో గృహాలను వారిసొంత స్థలంలోనే నిర్మించుకోనేందుకు నిధులు ఇస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్‌ సురే్‌షకుమార్‌ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన నిరుపేదలకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూంలు కేటాయిస్తామన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఆత్మకూరు మండల యువతకు ఉపాధి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దళితులకు దళితబంధు పథకాన్ని అందిస్తామన్నారు. పేదలకు కోసం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు.

వరంగల్‌ జిల్లాలో ఉంటేనే సౌకర్యం..

ఆత్మకూరు మండలం వరంగల్‌ జిల్లాలో ఉంటనే ప్రజలకు అన్నివిధాలు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే చల్లా అన్నారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పానని పేర్కొన్నారు. భౌగోళికంగా వరంగల్‌ జిల్లాలోనే కలసి ఉందన్నారు. కొందరు నాయకులు స్థాయిని మరిచి మాట్లాడుతూన్నారని కాంగ్రెస్‌ నేతలను, బీజేపీ నేతలను ఘాటుగా విమర్శించారు. ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, వ్యవసాయాధికారి యాదగిరి, సర్పంచ్‌లు పర్వతగిరి రాజు, సావూరే కమల, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు అర్షం వరుణ్‌గాంధీ, మండల రైతు కోఆర్డినేటర్‌ ఎక్కతాల్ల రవీందర్‌, ఎంపీటీసీలు బొమ్మగాని భాగ్య, బయ్య రమ, మండల పార్టీ అధ్యక్షు, కార్యదర్శులు లేతాకుల సంజీవరెడ్డి, బొల్లబోయిన రవియాదవ్‌ పాల్గొన్నారు. కాగా, రేషన్‌కార్డుల పంపిణీకి వస్తు న్న ఎమ్మెల్యే చల్లాను అడ్డుకుంటారని భారీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

వరంగల్‌ జిల్లా నుంచి వేరు చేయొద్దు..

కాంగ్రెస్‌, బీజేపీ నేతల వినతి

వరంగల్‌ జిల్లా నుంచి ఆత్మకూరు మండలాన్ని వేరు చేయొద్దని కోరుతూ ఎమ్మెల్యే చల్లాకు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, బీజేపీ నేతలు వేరువేరుగా వినతిపత్రాలను అందజేశారు. వినతి పత్రాన్ని సమర్పించిన వారిలో కాంగ్రెస్‌ నుంచి ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు కమలాపురం రమేష్‌, సర్పంచ్‌లు పర్వతగిరి రాజు, కంచ రవికుమార్‌, ఎంపీటీసీలు బీరం రజనీకర్‌రెడ్డి, పొగుల ఇందిర, పరకాల నియోజకవర్గ యూత్‌ కన్వీనర్‌ మాదాసి శ్రీధర్‌, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ ఏరుకొండ రవీందర్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు. అలాగే బీజేపీ పార్టీ నుంచి జిల్లా ఫ్రొటోకాల్‌ కన్వీనర్‌ ఎదులాపురం శ్రవణ్‌కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం, మండలపార్టీ ప్రధాన, కార్యదర్శులు బలవంతుల రాజు, ఉపుగల్లు శ్రీకాంత్‌రెడ్డి, బీజేవైఎం మండల అఽధ్యక్షుడు పొరెడ్డి ప్రదీ్‌పరెడ్డి, మండల బీసీసెల్‌ అధ్యక్షుడు వెల్దె సదానందం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-29T05:35:50+05:30 IST