సైకిక్‌ కిల్లర్‌కు సవాల్‌

Jul 30 2021 @ 06:02AM

నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ చిత్రం ‘నెట్రికన్‌’. తెలుగులో ‘మూడోకన్ను’ పేరుతో విడుదలవుతోంది. ఆగస్టు 13న హాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘నెట్రికన్‌’ ట్రైలర్‌ ను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తిస్థాయి ఫీమేల్‌ లీడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా కనిపించనున్నారు. చూపులేకపోయినా తనకున్న ప్రత్యేక గుణాలతో నగరంలో అమ్మాయిల వరుస హత్యలకు పాల్పడుతున్న సైకిక్‌ కిల్లర్‌ను ఎదుర్కొని ఆమె ఎలా విజయం సాధించారనేది ఆసక్తికరంగా తెరకెక్కించారని ట్రైలర్‌లో తెలుస్తోంది. మిలింద్‌ రావ్‌ దర్శకత్వంలో విఘ్నేశ్‌ శివన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నయనతార ప్రస్తుతం రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు. 


Follow Us on:

Otherwoodsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.