చాణ‌క్య నీతి: విద్య‌, ఉద్యోగం, ఉపాధి మార్గాల‌లో విజయానికి మీరు ఈ 5 విషయాలు త‌ప్ప‌నిస‌రిగా గుర్తుంచుకోండి.. స‌క్సెస్ దానంత‌ట అదే వ‌స్తుంది!

ABN , First Publish Date - 2021-11-25T12:00:54+05:30 IST

నైపుణ్యం కలిగిన వ్యూహకర్తగా, ఆర్థికవేత్తగా..

చాణ‌క్య నీతి: విద్య‌, ఉద్యోగం, ఉపాధి మార్గాల‌లో విజయానికి మీరు ఈ 5 విషయాలు త‌ప్ప‌నిస‌రిగా గుర్తుంచుకోండి.. స‌క్సెస్ దానంత‌ట అదే వ‌స్తుంది!

నైపుణ్యం కలిగిన వ్యూహకర్తగా, ఆర్థికవేత్తగా ఆచార్య చాణక్యుడు తెలిపిన జీవ‌న‌ విధానాలు ఎల్లప్పుడూ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కౌటిల్యునిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్యకు జీవితంలోని అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉంది. ఈ అనుభ‌వంతోనే చాలా పుస్తకాలను కూడా రాశారు. వీటిలో చాణ‌క్య‌నీతి ప్ర‌తీ ఒక్క‌రికీ ఉప‌క‌రించే గ్రంథంగా గుర్తింపు పొందింది. దీనిలో జీవితానికి సంబంధించిన అన్ని అంశాల ప్ర‌స్తావ‌న ఉంది. ఆచార్య చాణక్య‌ తన నీతిశాస్త్రంలో మతం, విద్య, భార్యాభర్తలు, సంపద, వృత్తి త‌దిత‌ర విషయాల గురించి వివ‌రించారు. చాణక్య తెలిపిన వివరాల‌ ప్రకారం ప్ర‌స్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎవ‌రైనా స‌రే త‌మ‌ కెరీర్‌లో విజయం సాధించాలనుకుంటే ఈ ఐదు విషయాలను నిరంత‌రం గుర్తుంచుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


నిజాయితీ, క్రమశిక్షణ

చాణ‌క్య నీతిలో తెలిపిన వివ‌రాల ప్రకారం ఎవ‌రైనా స‌రే జీవితంలో విజయం సాధించాలనుకుంటే ఎల్లప్పుడూ తాముచేసే పనిపట్ల నిజాయితీగా ఉంటూ, క్రమశిక్షణ క‌లిగి ఉండాలి. జీవితంలో క్రమశిక్షణ అనేది లేకపోతే ఏ విష‌యంలోనూ మీరు విజయం సాధించలేరు. అందుకే విజయ సాధ‌న‌కు క్రమశిక్షణ చాలా ముఖ్యమ‌ని గుర్తుంచుకోండి.

మంచి ప్రవర్తన 

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలనుకుంటే, అతను మంచి ప్రవర్తన క‌లిగివుండాలి. స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన‌వారు ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారని చాణక్య  తెలిపారు. అందుకే మ‌నిషి ఎప్పుడూ ఇత‌రుల‌తో మధురంగా మాట్లాడ‌టంతో పాటు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

రిస్క్ తీసుకునే ధైర్యం

ఎవ‌రైనా త‌మ కెరీర్‌లో విజయం సాధించాలంటే రిస్క్ తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇలాంటివారు భవిష్యత్తులో త్వరగా విజయం సాధిస్తార‌ని చాణక్య స్ప‌ష్టం చేశారు. 


టీమ్‌వర్క్

ఒక వ్యక్తి ఎప్పుడూ ఒంటరిగా విజయం సాధించలేడని, అతను ఎల్లప్పుడూ బృందంతో కలిసి పనిచేసే ధోరణిని కలిగి ఉండాలని చాణక్య చెబుతారు. ఎందుకంటే అందరితో క‌లుపుకుని వెళ్ల‌డం వ‌ల‌న కార్యం స‌ఫ‌ల‌మ‌వుతుంది. 

సామ‌ర్థ్యం 

ఆచార్య చాణక్య తెలిపిన వివ‌రాల ప్రకారం మ‌నిషి తన సామర్థ్యాల గురించి సరైన అవ‌గాహ‌న‌ కలిగి ఉండాలి. నిరంత‌రం త‌న‌ సామర్థ్యానికి అనుగుణంగా పని చేయాలి. అలాగ‌ని సామర్థ్యానికి మించి పని చేస్తే.. అది నష్టానికి దారి తీస్తుంద‌ని చాణ‌క్య హెచ్చ‌రించారు.

Updated Date - 2021-11-25T12:00:54+05:30 IST