Chanakya Niti: ఈ తరహా వ్యక్తులు ఎవరి బాధను అర్థం చేసుకోరు... వారి నిర్ణయమే అంతిమం!

ABN , First Publish Date - 2022-07-26T12:58:51+05:30 IST

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో...

Chanakya Niti: ఈ తరహా వ్యక్తులు ఎవరి బాధను అర్థం చేసుకోరు... వారి నిర్ణయమే అంతిమం!

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు, విధానాలను పేర్కొన్నాడు. వీటిని పాటించడం వల్ల మనిషి తన జీవితంలో విజయం సాధిస్తాడు. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో... ఎదుటివారి బాధను అర్థం చేసుకోని వ్యక్తుల గురించి ప్రస్తావించాడు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. అలాంటివారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

రాజు, పరిపాలన అధికారులు: 

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం రాజు, పరిపాలన అధికారులు ఎదుటివారి బాధలను, భావాలను అర్థం చేసుకోరు. వారు నిరంతరం నియమనిబంధనలు, సాక్ష్యాల ఆధారంగా ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటారు. న్యాయం జరిగేలా చూసేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.



వేశ్య:

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వేశ్య గురించి ప్రస్తావించాడు. వేశ్య తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తుందని, తనకు అందాల్సిన డబ్బు గురించి మాత్రమే ఆందోళన చెందుతుందని తెలిపారు. వీరు ఎదుటివారి పరిస్థితులను అర్థం చేసుకోరని చాణక్య తెలిపారు. 

దొంగలు 

ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం దొంగలు కూడా ఎవరి బాధను అర్థం చేసుకోరు. దొంగతనాలపైనే వారు దృష్టి సారిస్తారు. ఎదుటివారి వస్తువులు దొంగిలిస్తే వారు ఇబ్బందులకు పడతారనే విషయం గుర్తించరు. వారికి ఎదుటివారి అవస్థలు, బాధలు అనవసరం. 

యముడు

ఈ లోకంలోకి ఎవరు వచ్చినా ఏదో ఒకరోజు మరణించాల్సిందే. యముడు ఏఒక్కరి బాధలను, కష్టాలను పట్టించుకోడు. మరణ సమయం వచ్చినప్పుడు, ఎవరినీ విడిచిపెట్టడు. 

Updated Date - 2022-07-26T12:58:51+05:30 IST