చాణక్య నీతి: సమయం చూసి దెబ్బకొట్టే శత్రువులు మీ చుట్టూ ఉన్నారా?... అయితే ఈ చిన్న పనితో వారిని తరిమికొట్టండి!

ABN , First Publish Date - 2021-10-03T12:34:31+05:30 IST

మనిషి తన జీవితంలో విజయాన్ని ఎలా సాధించాలో...

చాణక్య నీతి: సమయం చూసి దెబ్బకొట్టే శత్రువులు మీ చుట్టూ ఉన్నారా?... అయితే ఈ చిన్న పనితో వారిని తరిమికొట్టండి!

మనిషి తన జీవితంలో విజయాన్ని ఎలా సాధించాలో ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వివరంగా తెలియజెప్పాడు. చాణక్యుడు చెప్పిన వివరాల ప్రకారం ఎవరైనా విజయం సాధిస్తే... వారిని చూసిన కొంతమంది అసూయకు లోనవుతుంటారు. ఇటువంటి స్థితిలో విజయం సాధించిన వ్యక్తి ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలని చాణక్యుడు సూచిస్తున్నాడు. శత్రువును ఎప్పుడూ ఉపేక్షించకూడదు. అంత తేలికగా తీసుకోకూడదు. అంటే తక్కువ అంచనా వేయకూడదు. శత్రువుతో ఏ విధంగా ప్రవర్తించాలో కూడా చాణక్యుడు ప్రజలకు తెలియజెప్పాడు.


చాణక్యునికి అనేక విషయాల్లో అమితమైన పరిజ్ఞానం ఉంది. అర్థశాస్త్రంతో పాటు చాణక్యుడు సైన్య శాస్త్రం, రాజనీతి శాస్త్రాలలో ఎంతో ప్రతిభ చాటాడు. చాణక్యుని భావనలో వ్యక్తి నిరంతరం ఎంతో అణకువతో, అప్రమత్తతతో మెలగాలి. చాణక్యుడు చెప్పిన ప్రకారం శత్రువులు రెండు రకాలు. వారిలో ఒక వర్గంవారిని మనం సులభంగా గుర్తించగలుగుతాం. మరో వర్గంవారు మనకు కనిపించకుండా ఉంటారు. వారిని మనం అంత సులభంగా గుర్తించలేం.  వారు సమయం చూసి దెబ్బతీసేందుకు ఎదురు చూస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో శత్రువుని ఓడించాలంటే చాణక్యుడు చెప్పిన సూత్రాలను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. చాణక్యనీతి ప్రకారం ఎవరైనాసరే తాము చేయబోయే పనుల ప్రణాళిక గురించి అందరితో చర్చించకూడదు. అయితే ఏదైనా భారీ ప్రణాళికలతో పనులు చేపట్టినప్పుడు మాత్రమే ఆ వివరాలను తనకు నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలి. ఒకవేళ శత్రువు చేతికి మన ప్రణాళిక చిక్కితే మనం చేయాలనుకున్న కార్యం చెడిపోతుంది. లేదా అనేక అవాంతరాలు ఏర్పడతాయి. చాణక్యనీతిని అనుసరించి చూస్తే, మనిషి ముఖ్యంగా అవగుణాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే శత్రువు మిమ్మల్ని ఓటమిపాలు చేసేందుకు మీ బలహీనమైన గుణాలను ఆసరాగా తీసుకుని, మిమ్మల్ని వంచిస్తాడు. ఓటమిపాలు చేస్తాడు.  అందుకే విజయం సాధించాలనుకునేవారు కోపానికి దూరంగా ఉండాలి. కోపంతో రగిలిపోతున్న వ్యక్తి తప్పుకి, ఒప్పుకి మధ్య తేడాను అంత త్వరగా, సులభంగా గుర్తించలేడు. అందుకే కోపానికి దూరంగా ఉన్నప్పుడే శత్రువులు ఎవరో సరిగా గుర్తించి వారితో ఎలా మెలగాలో గ్రహంచగలుగుతామని చాణక్యుడు తెలియజేశాడు.

Updated Date - 2021-10-03T12:34:31+05:30 IST