Chanakya Niti: మనిషి జీవితాన్ని మార్చే అద్భుత సూత్రాలు... ఆచరిస్తే దేనికీ లోటు ఉండదు!

ABN , First Publish Date - 2022-07-24T12:35:07+05:30 IST

ఆచార్య చాణక్యుడు తెలిపిన విషయాలన్నీ...

Chanakya Niti: మనిషి జీవితాన్ని మార్చే అద్భుత సూత్రాలు... ఆచరిస్తే దేనికీ లోటు ఉండదు!

ఆచార్య చాణక్యుడు తెలిపిన విషయాలన్నీ విలువైనవే. వందేళ్ల క్రితం నాటి పరిస్థితులలో ఆయన చెప్పిన విషయాలు, నేటి పరిస్థితులలో కూడా ఎంతో ఉపకరించేలా ఉన్నాయి. ఆచార్య తెలిపిన జీవన సూత్రాలను అమలు చేస్తే జీవన ప్రయాణం సులభతరం అవుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను దాటించడంలో సహాయపడే ఆచార్య తెలిపిన 4 విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు ఇతరులకు చెడు చేయకూడదని ఎల్లప్పుడూ చెప్పేవాడు. ఇతరులకు చెడు చేయడం ద్వారా, ఎవరికివారే చెడును కొనితెచ్చుకున్నవారవుతారు. ఫలితంగా మీ ఆలోచన ప్రతికూలంగా మారుతుంది. మీ ఆలోచనలు తప్పుదారి పడతాయి. అందుకే ఇతరులలోని తప్పులను వెదికే బదులు మీలోని తప్పులను గుర్తించేందుకు ప్రయత్నించండి. 


డబ్బు అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే... అయితే డబ్బు సంపాదించాలనే తపనతో దీనికోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకోవద్దని ఆచార్య సూచించారు. మీరు తప్పుడు మార్గంలో చాలా త్వరగా డబ్బు సంపాదించవచ్చు, కానీ తర్వాత మీరు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గ్రహించండి. చెల్లించాలి. ఇటువంటి డబ్బు ఎంత వేగంగా వస్తుందో, అంత వేగంగా వెళ్లిపోతుందని గ్రహించండి. జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ముఖ్యంగా రెండు విషయాలను గుర్తుంచువాలని ఆచార్య చెబుతుండేవారు. మొదటిది మహిళలకు గౌరవం ఇవ్వాలి. స్త్రీలను లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. రెండవది మీరు ఎక్కడ నివసించినా పరిశుభ్రత పాటించండి. పరిశుభ్రత లేని చోట లక్షీదేవి నివసించదు.  శారీరక పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని గుర్తించండి. ఇలావుండని పక్షంలో మీరు సంపాదించిన డబ్బు వ్యాధులకు లేదా ఇతర వృథా ఖర్చులకు వ్యయమైపోతుంది. మనిషి దురాశకు దూరంగా ఉండాలని ఆచార్య సూచించారు. దురాశ అనేది మనిషి ఉందే అతిపెద్ద లోపం. అది మనిషిని మరింతగా దిగజారుస్తుంది. అత్యాశను ఆశ్రయించినవారు తమకు తామే గొయ్యి తవ్వుకున్నవారవుతారని చాణక్య తెలిపారు.  

Updated Date - 2022-07-24T12:35:07+05:30 IST