చాణ‌క్య‌నీతి: ఈ ఐదు అలవాట్లు మీలో ఉన్నాయా? వెంటనే వదిలించుకోండి.... లేకపోతే ఏం జరుగుతుందంటే...

ABN , First Publish Date - 2021-10-04T11:55:20+05:30 IST

ఆచార్య చాణక్య గొప్ప దౌత్యవేత్త, మంచి వ్యూహకర్త...

చాణ‌క్య‌నీతి: ఈ ఐదు అలవాట్లు మీలో ఉన్నాయా? వెంటనే వదిలించుకోండి.... లేకపోతే ఏం జరుగుతుందంటే...

ఆచార్య చాణక్య గొప్ప దౌత్యవేత్త, మంచి వ్యూహకర్త. ఆయన ర‌చించిన‌ చాణక్య నీతి శాస్త్రం ఈ నాటికీ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొంది, ఆచరణయక్తంగా నిలిచింది. దీనిలో మ‌నిషి త‌న జీవితంలో సంతోషంగా ఉండటానికి ఉప‌యోగ‌ప‌డే అనేక అమూల్య‌మైన స‌ల‌హాలు ఉన్నాయి. జీవితంలోని ప్రతి అంశంలో మ‌నిషి ఎలా మెల‌గాలి? స‌మాజంలో ఎలా న‌డుచుకోవాలి? అనే దానిని ఆచార్య చాణక్యుడు ఆచరణాత్మకంగా దీనిలో సూచించాడు. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మ‌నిషి నైతికతను దెబ్బ‌తీసి, ప‌తనానికి దారితీసే ఐదు దుర‌ల‌వాట్ల‌ గురించి తెలియ‌జేశాడు. వీటిని వ‌దులుకోక‌పోతే ఏ వ్యక్తి అయినా సర్వనాశనం అవుతాడని తెలియ‌జేశాడు. 


నిర్లక్ష్యం: నిర్లక్ష్యం ఎప్ప‌టికైనా స‌రే నష్టానికి దారితీస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. మీకు సరైన ప‌రిజ్ఞానం లేని పనిని చేయాల‌నుకున్న‌ప్పుడు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహాలు తీసుకునేందుకు వెనకడుగు వేయకూడద‌ని చాణ‌క్యుడు సూచించాడు. ఈ విష‌యంలో చేసే నిర్ల‌క్ష్యం తీవ్ర న‌ష్టానికి దారి తీస్తుంద‌ని తెలియ‌జేశాడు. 


సోమరితనం: ఏ వ్యక్తినైనా నాశనం చేసే రెండవ అలవాటు సోమరితనం. ఆచార్య చాణక్య త‌న నీతి శాస్త్రంలో ప్ర‌తీ వ్యక్తి ఎల్లప్పుడూ క్రమశిక్షణతో జీవించాలని, ప్రతి పనికి త‌గిన సమయం నిర్ణయించుకోవాల‌ని చెప్పారు. సోమరిత‌నానికి ఎల్లప్పుడూ దూరంగా ఉండండి... తద్వారా మీరు సమయాన్ని సరిగ్గా స‌ద్వినియోగం చేసుకుని అనుకున్న ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి  చేయ‌గ‌లుగుతార‌ని చాణ‌క్య తెలిపారు. 


వ్యసనం: మత్తు మందుల అలవాటు ఎవ‌రినైనా స‌ర్వ‌నాశనం చేస్తుంది. వ్యసనం వల్ల ఆర్థికంగా నష్టపోవ‌డ‌మే కాకుండా మానసికంగా, శారీరకంగా హాని కలుగుతుంది. మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తి తప్పుడు దారిలో పడతాడు. అది అతని భవిష్యత్తును పాడు చేస్తుంద‌ని చాణ‌క్య తెలిపారు. 


చెడ్డ‌వారి సాంగ‌త్యం: చాణక్య నీతి ప్రకారం ఎవ‌రైనా ఎల్లప్పుడూ చెడ్డ‌వారి సాంగ‌త్యానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చెడ్డ‌వారితో సాంగత్యం చేసిన‌పుడు అత‌ను అన్ని విధాలా దిగ‌జారిపోతాడు. అలాంటి వ్యక్తి జీవితం క్రమంగా అంథ‌కారంపై వైపు ప‌యనిస్తుంది. లక్ష్యం నుండి దూర‌మ‌వ‌డానికి దారితీస్తుంది. అందుకే చెడ్డ‌వారి సాంగ‌త్యం కూడ‌ద‌ని చాణక్యుడు చెబుతున్నారు.


కామం: ఇక్కడ కామం అనేది లైంగిక కార్యకలాపాలను సూచిస్తుంది. చాణక్య నీతి ప్రకారం విప‌రీత‌మైన కామ‌వాంఛ‌ల‌కు అలవాటు పడిన వ్యక్తులు త‌మ జీవితాన్ని నాశ‌నం చేసుకుంటారు. అధిక కామ‌వాంఛ‌కార‌ణంగా వ్యక్తి మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోతాడు. అందుకే ఇటువంటి అలవాటును వెంటనే మానుకోవడం మంచిద‌ని చాణ‌క్య సూచిస్తున్నాడు.

Updated Date - 2021-10-04T11:55:20+05:30 IST