చాణక్యనీతి: డబ్బు గురించి తప్పక తెలుసుకోవలసిన 5 విషయాలు

ABN , First Publish Date - 2022-06-27T12:20:28+05:30 IST

డబ్బు మాత్రమే సర్వస్వం కాదని...

చాణక్యనీతి: డబ్బు గురించి తప్పక తెలుసుకోవలసిన 5 విషయాలు

డబ్బు మాత్రమే సర్వస్వం కాదని కొందరు అంటారు. మరికొందరు డబ్బుతో జీవితంలోని 70 శాతం సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతారు. డబ్బుతో సమస్యలు తలెత్తుతాయని కూడా అంటారు. అయితే ఆచార్య చాణక్య డబ్బు గురించి ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.  

పొదుపు చేయాలి

రాబోయే కష్టకాలాన్ని గుర్తించి, ముందుగానే డబ్బును పొదుపు చేసుకోవాలి. పొదుపు చేయవలసిన డబ్బు ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ అవసరమైన మేరకే ఖర్చు చేయాలి.

గౌరవం ఇవ్వాలి

సంపద అనేది జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇది మనిషికి గౌరవాన్ని అందిస్తుంది. ఊహించని విపత్తులను ఎదుర్కోవడానికి సాయపడుతుంది. 


డబ్బు ఉన్న చోటునే ఉండండి

ఉపాధి, గౌరవం, శ్రేయోభిలాషులు, విద్య లభించని ప్రాంతంలో నివసించడం వల్ల ఉపయోగం లేదు. సంపన్నులు, వ్యాపారులు, విద్యావంతులైన బ్రాహ్మణులు, సైనికులు, నదులు, వైద్యులు ఉన్న చోటునే మనిషి నివసించాలి. 

నిజాయితీకి పరీక్ష

మీరు డబ్బు లేదా ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు మీ భార్యలోని అసలైన నైజం బయటపడుతుంది. డబ్బు సాయంతో మీ స్నేహితులను, సేవకులను పరీక్షించండి. అప్పుడే వారి నిజాయితీ బయటపడుతుంది. 

త్యాగం అవసరం

కష్టపడి సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దానధర్మాలకు వినియోగించాలి. అవసరమైనప్పుడు ధనాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. 


Updated Date - 2022-06-27T12:20:28+05:30 IST