చాణక్య నీతి: విజయం సాధించాలంటే ఈ 8 లక్షణాలను విడిచిపెట్టాల్సిందే... లేదంటే జీవితమంతా కష్టాలే!

ABN , First Publish Date - 2021-11-08T12:19:41+05:30 IST

నేటి కాలంలో అందరూ విజయం..

చాణక్య నీతి: విజయం సాధించాలంటే ఈ 8 లక్షణాలను విడిచిపెట్టాల్సిందే... లేదంటే జీవితమంతా కష్టాలే!

నేటి కాలంలో అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. కష్టపడి పనిచేసినప్పటికీ, కొన్నిసార్లు విజయం సాధించలేరు. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో విజయం సాధించడానికి మూల సూత్రాలను చెప్పారు. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి వ్యక్తి ఈ 8 లక్షణాలను విడిచిపెట్టాలని ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


1. బద్దకం

ఆచార్య చాణక్య తెలిపిన ప్రకారం బద్దకం అనేది ఒక వ్యాధి కంటే తక్కువేమీ కాదు. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి వ్యక్తి బద్దకానికి దూరంగా ఉండాలి. మీరనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి తప్పనిసరిగా బద్దకాన్ని విడిచిపెట్టాలి.

2. కోపం 

కోపం మనిషిని అన్నివిధాలా నాశనం చేస్తుందని చాణక్య తెలిపారు. కోపంతో ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేడు. చాణక్య నీతి శాస్త్రం ప్రకారం, కోపం అనేది వ్యక్తి ఆలోచనా శక్తిని, అర్థం చేసుకునే శక్తిని నాశనం చేస్తుంది. అందుకే విజయం సాధించాలనుకునేవారు కోపాన్ని నియంత్రించుకోవాలి.

3. గురువును అవమానించడం

లక్ష్యాన్ని సాధించాలనుకునేవారు గురువును ఎప్పుడూ అవమానించకూడదు. గురువును అవమానించిన వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు. చాణక్య విధానం ప్రకారం కేవలం పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే జ్ఞానం అందుకోలేరు. గురువు మార్గదర్శకత్వంలోనే అసలైన జ్ఞానం లభిస్తుంది. అందుకే గురువును ఎప్పుడూ అవమానించకూడదు.


4. సమయాన్ని వృథా చేయవద్దు

కాలమే గొప్ప సంపద అని ఆచార్యులు చెప్పారు. కాలంతో పాటు పయనించని వ్యక్తి జీవిత యుద్ధంలో వెనుకబడిపోతాడు. మీరు విజయం సాధించాలనుకుంటే, సమయం వృథా చేయడం మానేయండి. సమయానికి అనుగుణంగా ముందుకు కదలండి ఎల్లప్పుడూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 

5. అతినిద్ర

రోజుకు 8 గంటల నిద్ర సరిపోతుందని ఆచార్య చాణక్య చెప్పారు. చాణక్య నీతి ప్రకారం, లక్ష్యాన్ని సాధించడంలో నిద్రావస్థ పెద్ద అవరోధంగా మారుతుంది. అందుకే లక్ష్యాన్ని సాధించాలంటే అతినిద్రను వదులుకోవాలి.

6. అత్యాశ

లక్ష్య సాధనలో అత్యాశ పెద్ద అడ్డంకి. ఈ దుర్గుణం లక్ష్యాన్ని సాధించడంలో పలు అడ్డంకులను సృష్టిస్తుంది. మితిమీరిన అత్యాశ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మీరు ఏ రంగంలో విజయం సాధించాలనుకున్నా అత్యాశకు దూరంగా ఉండాలని చాణక్య నీతి తెలియజేస్తోంది. 

7. నిరంతర వినోదం తగదు

చాణక్య నీతి ప్రకారం లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం వినోదించడాన్ని వదులుకోవాలి. ఏ పనీ చేయకుండా నిత్యం వినోదంలో నిమగ్నమవకూడదని చాణక్య తెలిపారు. ఇటువంటి నిరంతర వినోదాలు మిమ్మల్ని మీ లక్ష్యాల నుంచి దూరం చేస్తాయి. అందుకే ముందుగా మీరు చేయాలనుకున్న పనికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ పని పూర్తయ్యాక కాసేపు వినోదంలో మునగండని చాణక్య తెలిపారు. 

8. తల్లిదండ్రులను అవమానించవద్దు

తల్లిదండ్రులను కలలో కూడా అవమానించకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. తల్లిదండ్రుల స్థితి దేవుని కంటే ఉన్నతమైనది. అందుకే తల్లిదండ్రులను అవమానించకూడదు. తల్లిదండ్రులకు మీరిచ్చే గౌరవం మిమ్మల్ని ఉన్నతులుగా నిలబెడుతుందని చాణక్య తెలిపారు.

Updated Date - 2021-11-08T12:19:41+05:30 IST