చాణక్య నీతి: ఈ మూడు గుణాలు కలిగిన మగువ అందరిలో ఆదరణ పొందుతుంది.. కుటుంబాన్ని స్వర్గంలా మారుస్తుంది!

ABN , First Publish Date - 2021-11-10T12:30:59+05:30 IST

ఆచార్య చాణక్య ఉన్నతమైన తెలివితేటలు గల పండితుడు.

చాణక్య నీతి: ఈ మూడు గుణాలు కలిగిన మగువ అందరిలో ఆదరణ పొందుతుంది.. కుటుంబాన్ని స్వర్గంలా మారుస్తుంది!

ఆచార్య చాణక్య ఉన్నతమైన తెలివితేటలు గల పండితుడు. ఇప్పటికీ నాటి ఉత్తమ పండితులలో ఒకనిగా గుర్తింపు పొందుతున్నారు. చాణక్యునికి వివిధ విషయాలపై లోతైన అవగాహన ఉంది. ఆచరణాత్మక విషయాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తి. చాణక్యుడు అర్హత కలిగిన అధ్యాపకుడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించారు. నీతిశాస్త్రాల్లో ఆచార్య చాణక్యుడు రాసిన మాటలు మనిషి జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. చాణక్యుడు మనుషుల మధ్య సంబంధాలను, స్వభావాలను కూడా వివరించారు.  చాణక్యుడు.. స్త్రీని ఉన్నతంగా తీర్చిదిద్దే కొన్ని లక్షణాల గురించి తెలియజేశారు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


వినయ౦, దయ:

ఇవి కోపాన్ని జయించగల రెండు ఉత్తమ లక్షణాలని ఆచార్య చాణక్య తెలిపారు. వినయం, దయ.. ఈ రెండు లక్షణాలు కలిగిన మహిళ సమాజంలో ఉత్తమురాలిగా గుర్తింపు పొందుతారు. ఈ లక్షణాలు కలిగిన స్త్రీకి నిరంతరం గౌరవం లభిస్తుంది. అలాంటి మహిళ తన కుటుంబాన్ని చక్కగా కాపాడుకుంటుంది. కుటుంబంలో మంచి సంబంధాలను ఏర్పరుస్తుంది. ఈ లక్షణాలు కలిగిన స్త్రీ ఉన్న ఇంట్లో ఎప్పుడూ సంతోషం తాండవిస్తుంది. ఈ రెండు లక్షణాలు కలిగిన స్త్రీ సమాజంలోని ఇతరులకు ఒక ఉదాహరణగా నిలుస్తారు. 

ధర్మాచరణ:

భక్తి ప్రపత్తులతోపాటు ధర్మాచరణ కలిగిన స్త్రీ వంశానికి కీర్తిని తెస్తుంది. మతాన్ని, ధర్మాన్ని అనుసరించే స్త్రీ గౌరవానికి అర్హురాలు. ఇటువంటి మహిళ తన కుటుంబానికి మాత్రమే కాకుండా, సమాజానికంతటికీ కూడా సరైన మార్గాన్ని చూపిస్తారు. తప్పొప్పులకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోగలుగుతారు. చాణక్య నీతి ప్రకారం మతాన్ని, ధర్మాన్ని అనుసరించే స్త్రీ ఉత్తమురాలు.

పొదుపరి:

డబ్బును కూడబెట్టే లక్షణం కలిగిన మహిళ.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినపుడు కుటుంబానికి అండగా నిలబడగలుగుతారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే లక్షణం కలిగిన మహిళ ఉంటే ఆ కుటుంబం మొత్తం ఇబ్బందులను ఎదుర్కోవలసివస్తుంది. సమస్యలు తలెత్తినపుడు, వ్యక్తి మృతి చెందినపుడు డబ్బు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే మహిళ డబ్బును కూడబెట్టే లక్షణం కలిగివుండాలి.

Updated Date - 2021-11-10T12:30:59+05:30 IST