Chanakya Niti: సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలంటే చేయాల్సిన 4 పనులివే...

ABN , First Publish Date - 2022-07-23T12:30:04+05:30 IST

చాణక్యుడు భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన...

Chanakya Niti: సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలంటే చేయాల్సిన 4 పనులివే...

చాణక్యుడు భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన గొప్ప తత్వవేత్త, సలహాదారు, గురువు. ఆచార్య తెలిపిన నీతి ప్రకారం భార్యాభర్తలు ఒకరికొకరు అన్యోన్యంగా ఉండాలి. వారిలో ఒక్కరు తప్పుదారి పట్టినా కుటుంబంలో కలతలు ప్రారంభమవుతాయి. భార్యాభర్తల మధ్య పరస్పర సమన్వయం లేకపోతే ఇంట్లో లక్ష్మిదేవికి స్థానం ఉండదని అంటారు. భార్యాభర్తలు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పరస్పర గౌరవం

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలు ఒకరికొకరు స్నేహితులుగా ఉండాలి. అదే సమయంలో వారి మధ్య ప్రేమతో పాటు గౌరవం ఉంటే ఆ సంబంధం మరింత అందంగా మారుతుంది. అందుకే ఎల్లప్పుడూ ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుంటేనే భార్యాభర్తల అనుబంధం బలపడుతుంది.


ఐక్యత అవసరం

చాణక్య నీతిలో తెలిపినదాని ప్రకారం భార్యాభర్తలు బండికి రెండు చక్రాలు. ఇద్దరూ కలిసి ముందుకు సాగాలి. ఒక చక్రం పాడైతే, మరొక చక్రం వాహనాన్ని ముందుగకు లాగలేదు. ఏదైనా పని పూర్తి కావాలంటే భార్యాభర్తలు పోటీగా కాకుండా ఐక్యతతో పనిచేయాలి. ఏ విషయంలోనూ ఒకరిపై ఒకరు అహంకారం చూపకూడదు.

ఓపికపట్టండి

ఎవరైనాసరే విజయవంతమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటే, భార్యాభర్తలిద్దరూ సహనంతో మెలగాలి. అప్పుడే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగగలుగుతారు. కష్టాల్లో సంయమనం కోల్పోని భార్యాభర్తలే జీవితంలో విజయం సాధిస్తారు.

వ్యక్తిగత విషయాల్లో గోప్యం 

ఆచార్య చాణక్య తన నీతిలో దంపతుల వ్యక్తిగత వివరాలు చాలా రహస్యంగా ఉండాలని చెప్పారు. వారి వ్యక్తిగత విషయాలు  మూడో వ్యక్తికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే భార్యాభర్తల బంధంలో కలతలు చోటుచేసుకుంటాయి. 

Updated Date - 2022-07-23T12:30:04+05:30 IST