Chanakya Niti: ఈ విషయాలు మనిషికి విజయాన్ని అందించడంలో పాటు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులను చేస్తాయి!

ABN , First Publish Date - 2022-07-30T12:34:19+05:30 IST

విద్య, వివేకం, శ్రద్ధ అనేవి జీవితంలో విజయానికి మూడు...

Chanakya Niti: ఈ విషయాలు మనిషికి విజయాన్ని అందించడంలో పాటు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులను చేస్తాయి!

విద్య, వివేకం, శ్రద్ధ అనేవి జీవితంలో విజయానికి మూడు ప్రధాన సూత్రాలు. ఈ మూడు గుణాలు ఉన్న వ్యక్తి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఆచార్య చాణక్యుడు ఇదే విషయాన్ని చాణక్య నీతిలో వివరించారు. ఆచార్య చాణక్యుడిని జ్ఞాన భాండాగారమని అంటారు. ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోని అత్యుత్తమ విద్వాంసులలో ఒకరు. 


రాజకీయాలు, దౌత్యం, ఆర్థిక శాస్త్రంపై ఉపయుక్తమైన విధానాలను రూపొందించారు. ఇవి జీవితంలో ఎదురయ్యే అనేక అడ్డంకులను తొలగిస్తాయి. చాణక్య నీతిలో మనిషి ఎలా ప్రవర్తించాలో తెలియజేశారు. ఎవరైనా సరే ఎప్పుడైనా ఉద్రేకంతో లేదా అపరిమిత ఉత్సాహంతో ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే అటువంటి స్థితిలో మనస్సాక్షి లోపిస్తే వైఫల్యానికి దారితీస్తుంది. తెలివిగా పనిచేసే వారిపై తల్లి లక్ష్మిదేవి ఆశీర్వాదం కురుస్తుంది. హడావుడిగా చేసే పనికి, ఆలోచనతో చేసే పనికి చాలా తేడా ఉందని చాణక్య తెలిపారు. కోపం లేదా తొందరపాటుతో వ్యవహరించే వ్యక్తి ప్రతికూల ఫలితాలను పొందేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. అంటే కోపంతో పనిచేసినప్పుడు ఆలోచనాశక్తిని కోల్పోతాం. అత్యుత్సాహంతో అంటే తొందరపాటుతో ఏదైనా పనిచేస్తే ఆశించిన ప్రయోజనం దక్కదు. ఇది మనిషి అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తుందని చాణక్య తెలిపారు. అందుకే మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓపికగా, ఆలోచనతో వ్యవహరించాలి. ఓర్పు కలిగిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను నడిచే మార్గం నుండి తడబడడు. పని చేయడానికి ముందు ఆ వ్యక్తి తప్పుఒప్పులను వేరు చేసి, పనిని విజయవంతం చేస్తాడు. అటువంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-07-30T12:34:19+05:30 IST