chanakya niti: ఈ లక్షణాలు కలిగిన యువతతోనే దేశ ప్రగతి!

ABN , First Publish Date - 2022-08-13T12:34:33+05:30 IST

యువతను దేశ సంపదగా పరిగణిస్తారు.

chanakya niti: ఈ లక్షణాలు కలిగిన యువతతోనే దేశ ప్రగతి!

యువతను దేశ సంపదగా పరిగణిస్తారు. యువత కారణంగానే దేశం ప్రగతిపథంలో, విజయపథంలో నడుస్తుంది. విద్య, నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో ఉంటే ఆ దేశం అన్ని రంగాలలో ఉన్నతిని చవిచూస్తుంది. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి ద్వారా ఈ విషయాన్ని వివరించడానికి ప్రయత్నించాడు. చాణక్య నీతి ప్రకారం మార్పుకు, ప్రగతికి బాటలు వేసేది యువతే. బద్ధకం, ఆలోచనా రాహిత్యం, నిరక్షరాశ్యత, క్రమశిక్షణ లేని యువత రాష్ట్రాన్ని, దేశాన్ని, కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. 


యువత బద్ధకాన్ని వదిలివేసి, లక్ష్యాన్ని సాధించేందుకు కఠోర సాధన చేయాలి. కుటుంబానికి పేరు తెచ్చేలా ప్రవర్తించాలి. దేశ పురోగతికి కృషి చేయాలి. దారి తప్పిన యువకులను దారిలోకి తీసుకురావాలి. చాణక్య నీతి ప్రకారం అబద్ధం అనేది ఘోరమైన పాపంతో సమానం. అందుకే యువత అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. సుగుణాలు కలిగినవారు మాత్రమే జీవితంలో విజయం సాధిస్తారు. కుటుంబంలో, సమాజంలో కీర్తిని పొందుతారు. దీనితో పాటు యువత తమ విధుల విషయంలో అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే వారు లక్ష్యం దిశగా నిరంతరం ముందుకు సాగి విజయం సాధించగలుగుతారు. అవినీతికి పాల్పడే వ్యక్తికి సమాజంలో, కుటుంబంలో గౌరవం లభించదు.

Updated Date - 2022-08-13T12:34:33+05:30 IST