చాణక్య నీతి: ఈ విధమైన ప్రవర్తన కలిగినవారికే సమాజంలో గౌరవ మర్యాదలు.. లేదంటే ఎప్పటికైనా అవమానమే..

ABN , First Publish Date - 2021-12-15T12:16:02+05:30 IST

ఆచార్య చాణక్య గొప్ప పండితులలో ఒకరిగా పేరొందారు.

చాణక్య నీతి: ఈ విధమైన ప్రవర్తన కలిగినవారికే సమాజంలో గౌరవ మర్యాదలు.. లేదంటే ఎప్పటికైనా అవమానమే..

ఆచార్య చాణక్య గొప్ప పండితులలో ఒకరిగా పేరొందారు. చాణక్య.. దౌత్యం, ఆర్థిక శాస్త్రంలో నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచారు. ఆచార్య చాణక్య తన జీవితంలో ఎదురైన దుర్భర పరిస్థితుల్లోనూ ఎంతో నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించి విజయం సాధించారు. ఆచార్య చాణక్యుని కౌటిల్యుడు. విష్ణు గుప్తుడు అని కూడా అంటారు. చాణక్య తన చాణక్య నీతిలో జీవితంలోని వివిధ కోణాలను సృజించారు. ఇవి నేటికీ అందరికీ ఉపయుక్తంగా ఉన్నాయి. చాణక్య నీతిలో సంపద, అభివృద్ధి, స్నేహం మొదలైన విషయాల ప్రస్తావనవుంది. జీవితంలో గౌరవంగా బతకాలంటే మనిషి కొన్ని అవలక్షణాలను విడిచిపెట్టాలని ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఇతరుల గురించి చెడుగా మాట్లాడ వద్దు

ఆచార్య చాణక్యుని విధానాల ప్రకారం ఇతరులను నిందించడం మానేయాలి. ఇతరులను నిందించడం ద్వారా ఆనందంపొందేవారికి దూరంగా ఉండాలి. అలాగే చెడుగా మాట్లాడేవారికి దూరంగా ఉండాలి. ఇతరుల గురించి చెడు మాట్లాడనివారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. లేనిపక్షంలో అందరిలో గౌరవాన్ని కోల్పోతారు.

అబద్ధాలు ఆడవద్దు

మనిషి ఎప్పుడూ సన్మార్గంలో నడవాలని ఆచార్య చాణక్య తెలిపారు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సత్యమార్గాన్ని వదులుకోకూడదు. జీవితంలో విజయం సాధించడానికి అబద్ధాలను ఆశ్రయించే వ్యక్తి సాధించే విజయం దీర్ఘకాలం నిలవదు. అటువంటి వ్యక్తికి సంబంధించిన నిజనిజాలు బయటపడినప్పుడు  అతను అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి అబద్ధాలను ఆశ్రయించకూడదు.

గొప్పలు చెప్పుకోవద్దు

ఎదుటివారితో లేనిపోని గొప్పలు చెప్పుకోకూడదు. ఆడంబరాలకు పోకూడదు. ఇలాంటివారికి సంబంధించిన నిజానిజాలు బయటపడినప్పుడు వారు అగౌరవం పాలవుతారు. విజయం సాధించిన వారు వినయ విధేయతలతో మెలగడం ద్వారా అందరిలో గౌరవం పొందుతారని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-12-15T12:16:02+05:30 IST