చాణ‌క్య‌నీతి: మ‌గువ‌లు ఇష్టపడాలంటే పురుషుడు చేయాల్సిన మూడు పనులు.. కాదంటే కనీస గౌరవం కూడా దక్కదు!

ABN , First Publish Date - 2021-10-19T11:48:47+05:30 IST

ఆచార్య చాణక్యుడు పురుషుల విష‌యంలో..

చాణ‌క్య‌నీతి: మ‌గువ‌లు ఇష్టపడాలంటే పురుషుడు చేయాల్సిన మూడు పనులు.. కాదంటే కనీస గౌరవం కూడా దక్కదు!

ఆచార్య చాణక్యుడు పురుషుల విష‌యంలో ప్రత్యేక సూచ‌న‌లు చేశారు. మ‌గ‌వారు ఈ మూడు పనులు చేయడానికి ఏమాత్రం భయపడకూడ‌ద‌ని తెలిపారు. ఇలా భ‌య‌ప‌డిన ప‌క్షంలో మీరు కొన్ని విలువైన వాటిని పొందలేర‌ని స్ప‌ష్టం చేశారు. చాణక్య నీతి ప్రకారం, కొంతమంది చాలా విష‌యాల్లో మౌనం వహిస్తూ లోలోన భయపడుతుంటారు. అలాంటి వారు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వ‌స్తుంది. పురుషులు ఈ మూడు విషయాలలో ఎప్పుడూ భయపడకూడదని ఆచార్య చాణక్య చెప్పారు. ఆ విష‌యాలేమిటో తెలుసుకుని, మీరు మీ జీవితంలో వాటిని అమ‌లు చేయండి.. తగిన గౌరవం పొందండి. 


1. పురుషుడు ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేయడానికి సిగ్గుపడకూడదు. ఒకవేళ ఆమె మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే, మీరు కూడా ఆమెను ప్రేమిస్తే, మీరు వెంటనే ఆమెకు  ఆ విష‌యాన్ని చెప్పండి. లేకుంటే ప‌రిస్థితులు చేజారిపోవ‌చ్చు. మీకున్న‌ భయం మీ ప్రేమను అంతం చేస్తుంది. అలాగే పెళ్లి త‌రువాత హనీమూన్ సమయంలో పురుషులు సిగ్గుపడకూడదు. హనీమూన్ వేళ భార్య‌ ముందు మీరు సిగ్గుపడితే, ఆమె మిమ్మల్ని గౌరవించదు. అందుకే మీ భార్య నుండి ప్రేమను అందుకునేందుకు ఎప్పుడూ సందేహించ‌కూడ‌దు. ప్రేమను అడగడానికి లేదా తీసుకోవడానికి మీరు మొహ‌మాట‌ప‌డితే మీ మ‌ధ్య సంబంధం చెడిపోవచ్చు. అందుకే హనీమూన్‌లో సిగ్గుపడకూడదు. అలా సిగ్గుప‌డితే భార్య మీ గురించి తప్పుగా అర్థం చేసుకునే అవ‌కాశం ఉంది. మరొక విష‌యాన్ని పురుషుడు త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి. పురుషుడు ఎప్పుడైనా మ‌రో వివాహిత స్త్రీని ప్రేమించకూడదు. ఇటువంటి సంబంధాలు ఏ సమయంలోనైనా మీకు ఎలాంటి హాని కలిగించవచ్చు.


2. ఆచార్య చాణక్య తెలిపిన నీతి సూత్రాల ప్ర‌కారం పురుషులు త‌న‌కు ఎదురైన దు:ఖం, పేదరికంలాంటి కఠిన పరీక్షలకు భయపడకూడదు. ఎందుకంటే ఇటువంటి విష‌యాల్లో మ‌నం ఎంత భ‌య‌ప‌డ‌తామో, వాటివలన అంత ఎక్కువ నష్టం క‌లుగుతుంది. క్లిష్ట ప‌రిస్థితులు ఎదురైన‌పుడు మాన‌సికంగా దృఢంగావుంటూ, వాటిని ఎదుర్కొని, మన పరిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకోవాలి.

3. మీరు లోపల బలహీనంగా ఉన్నా, దానిని బ‌య‌ట‌కు ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు. ఎందుకంటే భార్య రూపంలో ఒక మ‌హిళ మీపై ఎంతో న‌మ్మ‌కాన్ని పెట్టుకుంటుంది. భ‌ర్త ఖచ్చితంగా తనను అన్ని ప‌రిస్థితుల‌లోనూ సంర‌క్షిస్తాడ‌ని ఆమె భావిస్తుంది. మీరు భార్య ఎదుట ప్ర‌తీ చిన్న విష‌యానికీ కలత చెందుతుంటే, ఆమె మీపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని కోల్పోతుంది. ధైర్యాన్ని కోల్పోతుంది. అప్పుడు మీరు ఇబ్బందులు ఎదుర్కోవ‌లసి వ‌స్తుంది. ఎందుకంటే ఒక మహిళ దృష్టిలో ఆమె భ‌ర్తే ఆమెకు హీరో. అత‌నే భ‌య‌ప‌డితే ఆమె అతడిని చాలా చుల‌క‌న‌గా చూస్తుంది. అలాంటి పురుషుణ్ణి భార్య ఎప్ప‌టికీ గౌర‌వించ‌దు.



Updated Date - 2021-10-19T11:48:47+05:30 IST