చాణక్య నీతి: ఎటువంటివారితో స్నేహం చేయకూడదు?... ఈ విషయాలు తెలిస్తే ఎప్పటికీ మోసపోరు!

ABN , First Publish Date - 2022-04-07T12:36:16+05:30 IST

చాణక్య నీతి ప్రకారం ఎవరైనాసరే స్నేహం విషయంలో...

చాణక్య నీతి: ఎటువంటివారితో స్నేహం చేయకూడదు?... ఈ విషయాలు తెలిస్తే ఎప్పటికీ మోసపోరు!

చాణక్య నీతి ప్రకారం ఎవరైనాసరే స్నేహం విషయంలో కొన్ని అంశాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మంచి స్నేహితుడనేవాడు జీవితంలో దక్కిన అద్భుతమైన బహుమతి కంటే ఏమాత్రం తక్కువ కాదు. అయితే స్నేహితుడు.. శత్రువుగా మారితే అంతకు మించిన బాధ మరొకటి ఉండదు. అందుకే స్నేహం చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చాణక్య తెలిపారు. చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు ఈ పద్యం ద్వారా స్నేహం గురించి తెలియజెప్పాడు. 




న విశ్వసేత్కుమిత్రే చ మిత్రే చాపి న విశ్వసేత్ ।

కదాచిత్కుపితం మిత్రం సర్వగుహ్యం ప్రకాశయేత్ ।।

చాణక్య నీతిలోని ఈ శ్లోకంలో.. చెడ్డ స్నేహితుడిని ఎప్పుడూ నమ్మవద్దు అని పేర్కొన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మీపై కోపగించినప్పుడు ఉంటే మీ వ్యక్తిగ రహస్యాలను బహిర్గతం చేయడానికి అవకాశాలు పెరుగుతాయి. స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. సరైన స్నేహితుడు లేకపోతే నష్టపోయే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి స్వార్థపూరిత స్నేహితులకు దూరంగా ఉండాలి. దీనితో పాటు, చాణక్యుడు మరొక శ్లోకంలో కూడా స్నేహం గురించి వివరించడానికి ప్రయత్నించాడు.

పరోక్షే కార్యాహన్తరం ప్రత్యక్షే ప్రియవాదినమ్ ॥

వర్జ్జయేతాదృశం మిత్రా విషకుమ్భమ్ప్యోముఖమ్ ।

చాణక్య నీతిలోని ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మీ ముఖం మీద తియ్యగా మాట్లాడే వారిని నమ్మకండి. వారు మీ వెనుక మీపై కుట్ర చేసి, హాని చేయాలని అనుకుంటారని ఆచార్య చాణక్య తెలిపారు. స్వార్థపరులు, అత్యాశగల వ్యక్తుల దగ్గర ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, వారు తమ స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తారని చాణక్య నీతి చెబుతుంది. స్వార్థపరుడు తన ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధపడతాడు. అలాంటివారు ఎంతో ప్రమాదకరం. వారు తమ స్వలాభం కోసం ఎవరినైనా మోసం చేస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చుట్టూ అలాంటి వారు చేరుతారో అప్పుడు అతనికి హాని జరగడం ఖాయం. అందుకే అలాంటి వారిని వెంటనే దూరం పెట్టాలని ఆచార్య చాణక్య సూచించారు.  

Updated Date - 2022-04-07T12:36:16+05:30 IST