చాణక్య నీతి: ఏ రంగంలోనైనా విజ‌యం సాధించేందుకు ఈ మూడు ప్ర‌శ్న‌లు వేసుకోండి.. ఈ ఆరు సూత్రాలతో మీకు తిరుగుండ‌దు!

ABN , First Publish Date - 2021-10-15T16:19:19+05:30 IST

ఆచార్య చాణక్య.. నైతికతతో సాధించే విజయానికి సంబంధించిన ప‌లు విధానాలను వివరించారు. చాణక్యుడు సూచించిన‌ ఈ విధానాలను అవలంబించడం ద్వారా చాలామంది త‌మ ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయాన్ని సాధించ‌డంతోపాటు

చాణక్య నీతి: ఏ రంగంలోనైనా విజ‌యం సాధించేందుకు ఈ మూడు ప్ర‌శ్న‌లు వేసుకోండి.. ఈ ఆరు సూత్రాలతో మీకు తిరుగుండ‌దు!

ఆచార్య చాణక్య.. నైతికతతో సాధించే విజయానికి సంబంధించిన ప‌లు విధానాలను వివరించారు. చాణక్యుడు సూచించిన‌ ఈ విధానాలను అవలంబించడం ద్వారా  చాలామంది త‌మ ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయాన్ని సాధించ‌డంతోపాటు, ఆ విజ‌యాన్ని అలానే కొన‌సాగిస్తున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా ఎవ‌రికివారు మొదట త‌మ‌లో తాము ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాల‌ని చాణక్యుడు చెప్పాడు. మొదటి ప్రశ్న ఏమిటంటే.. నేను ఈ పనిని ఎందుకు చేస్తున్నాను? రెండవది.. ఫలితం ఏమిటి? మూడవది.. నేను ఈ పనిలో విజయం సాధిస్తానా? అనే ఈ మూడు ప్రశ్నలకు స‌రైన సమాధానాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పనిని ప్రారంభించాలని చాణక్యుడు చెప్పాడు. ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం సాధించేందుకు చాణక్యుడు చెప్పిన విజ‌య సూత్రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.


1. చాణక్య నీతి ప్రకారం ఏ ప‌నిలోనైనా విజయం సాధించాలంటే.. మీరు చేయ‌బోయే పని గురించి అంద‌రికీ చెప్ప‌కూడ‌దు. మీ వ్యూహాన్ని రహస్యంగా ఉంచాలి. ఆ పనిలో విజయం సాధించడానికి నిరంత‌రం ప్ర‌య‌త్నించాలి.


2. మీలో భయం తలెత్తడం మొదలు కాగానే దానికి వెంట‌నే పరిష్కారం కనుగొనాల‌ని చాణక్యుడు చెబుతాడు. అంటే మీకు భ‌యం క‌లిగిన‌ప్పుడు, దానికి భిన్న‌మైన‌రీతిలో ఆలోచిస్తూ, దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి. భ‌యాన్ని ప‌క్క‌కునెట్టి విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి.


3. చాణక్య నీతి ప్రకారం గతం గురించి ఆలోచిస్తూ, చింతించకూడదు. అలాగే భవిష్యత్తు పర్యవసానాల గురించి అధికంగా ఆలోచించి, ఆందోళన చెందకూడదు. జ్ఞాని వర్తమానంలో మాత్రమే ధ్యానం చేస్తాడు. ఇలా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తి  భవిష్యత్తు దానంత‌ట అదే బాగుప‌డుతుంది.


4. స్వార్థం లేకుండా ఎవరూ  మీకు స్నేహితునిగా మెల‌గ‌ర‌ని చాణ‌క్య చెబుతారు. అందుకే స్నేహితుల విష‌యంలో అనునిత్యం జాగ్రత్తగా ఉండాలి.


5. మ‌నిషి ఒంటరిగా జన్మించి, ఒంటరిగానే మరణిస్తాడు. అలాగే తన మంచి, చెడు క‌ర్మ‌ల‌ ఫలాలను తానే అనుభ‌వించాలి. అందుకే మంచి పనులు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నించాలి.


6. విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం క‌లిగివుండాల‌ని చాణక్యుడు చెప్పాడు. చాణ‌క్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన పుట్టుక ద్వారా కాకుండా త‌న‌ చర్యల ద్వారా గొప్పవాడ‌వుతాడు. అందుకే తాను విశ్వ‌సిస్తున్న మ‌తం చెప్పిన మంచి మార్గాన్ని అనుస‌రిస్తూ ముందుకు సాగాలి.

Updated Date - 2021-10-15T16:19:19+05:30 IST