Chanakya Niti: ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే కష్టాలు వెంటాడుతాయి!

ABN , First Publish Date - 2022-07-28T13:01:16+05:30 IST

స్నేహితుడిని, శత్రువును పరీక్షించడానికి అనేక విధానాలను...

Chanakya Niti: ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే కష్టాలు వెంటాడుతాయి!

స్నేహితుడిని, శత్రువును పరీక్షించడానికి అనేక విధానాలను ఆచార్య చాణక్య తెలియజేశారు. విజయపథంలో అడ్డంకులను తొలగించుకునే మార్గాలను తెలియజేశారు. జీవితంలోని కొన్ని విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే జీవితం చిక్కుల్లో పడుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా సరే అధికారంలో ఉన్నవారితో వివాదాలు తెచ్చుకోకూడదని చాణక్య తెలిపారు. అది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. 


వారితో శత్రుత్వం హాని కలిగిస్తుందని తెలిపారు. మనిషికి ఆరోగ్యమే అతిపెద్ద సంపద అని, తన ఆరోగ్యంతో ఆడుకునే వ్యక్తి ఇబ్బందుల పాలవుతాడని చాణక్య తెలిపారు. అటువంటి వ్యక్తి తనను తాను మృత్యువుకు సమీపంలోకి వెళతాడని చాణక్య తెలిపారు. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం జీవనోపాధి కోసం డబ్బు సంపాదించడం ఎంత అవసరమో శరీర సంరక్షణ కూడా అంతే ముఖ్యం. ఆహారపానీయాల విషయంలో చేసే అజాగ్రత్త అకాల మరణానికి దారితీస్తుందని చాణక్య హెచ్చరించారు.  అధికారం విషయంలో బలంగా ఉన్న వ్యక్తి తన గుర్తింపును కాపాడుకునేందుకు ఇతరులకు హాని చేయడానికి వెనుకాడదు. అందుకే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్య సూచించారు. ధనవంతులు డబ్బు బలంతో చట్టాన్ని, న్యాయాన్ని కూడా కొనుగోలు చేసేందుకు వెనుకాడరు. అలాంటివారితో వివాదం పెట్టుకుంటే కష్టాల్లో పడతారని చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-07-28T13:01:16+05:30 IST