చాణక్య నీతి : ఇవి ఎంతో పూజనీయం... వివాదం పెట్టుకుంటే తీవ్ర నష్టం!

ABN , First Publish Date - 2022-06-08T12:26:08+05:30 IST

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ...

చాణక్య నీతి : ఇవి ఎంతో పూజనీయం... వివాదం పెట్టుకుంటే తీవ్ర నష్టం!

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పూజనీయుమైనవిగా  పరిగణించే 7 అంశాల గురించి తెలిపాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మంలో అగ్నిని దేవతగా భావిస్తారు. దీపం లేదా యాగం లేకుండా ఏ శుభ కార్యం మొదలుకాదు. అగ్నితో ఆటలాడేవారు కష్టాలపాలవుతారు. ఏ శుభకార్యమైనా బ్రాహ్మణుల సారధ్యంలో జరుగుతుంది. ఎవరైనా చనిపోయిన తర్వాత బ్రాహ్మణులు కర్మకాండ నిర్వహిస్తారు. అందుకే బ్రాహ్మణులు పూజనీయులయ్యారు. వారిని ఎప్పుడూ అవమానించకూడదని చాణక్య తెలిపారు. 


గురువు ఇతరులకు మంచి భవిష్యత్తును అందిస్తాడు. అందుకే గురువును ఎప్పుడూ అవమానించకూడదు. హిందూ ధర్మంలో పెళ్లికాని యువతులను దేవతలుగా భావిస్తారు. వారిని చెడు దృష్టితో చూసేవారు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఇంటి పెద్దల క్రమశిక్షణ కారణంగానే ఇల్లు సక్రమంగా ఉంటుంది. అందుకే పెద్దలను గౌరవించాలి. వారి ఆశీర్వాదం ఉంటే ఎంతటి సమస్యలైనా తొలగిపోతాయి. హిందూ ధర్మంలో ఆవును తల్లిగా భావిస్తారు. ఆవు 33 కోట్ల దేవతలకు నిలయమని చెబుతారు. అందుకే ఆవును సేవించాలని అంటారు. శిశువును భగవంతుని స్వరూపంగా భావిస్తారు. శిశువులను బాధించడం ఎవరికీ శ్రేయస్కరం కాదు. 

Updated Date - 2022-06-08T12:26:08+05:30 IST