Chanakya Niti: మనిషి చనిపోయేవరకూ అంటిపెట్టుకుని ఉండే మూడు విషయాలు.., వాటిని వేరు చేయడం కష్టం

ABN , First Publish Date - 2022-08-03T12:59:18+05:30 IST

పుట్టిన వాడు చనిపోవడం ఖాయం అన్నది...

Chanakya Niti: మనిషి చనిపోయేవరకూ అంటిపెట్టుకుని ఉండే మూడు విషయాలు.., వాటిని వేరు చేయడం కష్టం

పుట్టిన వాడు చనిపోవడం ఖాయం అన్నది ప్రకృతి ధర్మం. ప్రతీవ్యక్తి జీవితాంతం తన చర్యల మంచి, చెడుల పరిణామాలను అనుభవిస్తాడు. ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంతో ముడిపడిన అనేక విషయాలను వెల్లడించారు. ఎవరికైనా జీవితంలో చాలామంది స్నేహితులు కలుస్తూ, విడిపోతూ ఉంటారు. అయితే మనిషిని మరణం వరకు విడిచిపెట్టని కొన్ని విషయాలున్నాయి. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో అయినా ఈ మూడు విషయాలు మనిషిని విడిచిపెట్టవు. 

విద్యా మిత్రా ప్రవశేషు భార్యా మిత్ర గృహేషు చ ।

వ్యాధితస్యౌషధం మిత్ర ధర్మ మిత్ర మృతస్య ।


జ్ఞానం

జ్ఞానమనే ఆయుధం ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా ఉండలేడని ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా చెప్పాడు. విద్య కంటే మించిన మంచి స్నేహితుడు లేడు. ఒంటరిగా ఉన్న వ్యక్తి తన తెలివితేటలతో ప్రతికూల పరిస్థితుల నుండి బయట పడతాడు. విద్యతోనే మనిషికి విజయం లభిస్తుంది. అందుకే మనిషి జ్ఞానాన్ని సంపాదించాలి.

ఔషధం

వ్యాధి నుండి బయటపడటానికి ఔషధం ఉపయోగపడుతుంది. నిజమైన స్నేహితుని మాదిరిగనే ఔషధం వ్యాధిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఔషధం దగ్గరలో లేకపోతే ఆరోగ్యంగా ఉండటం కష్టం. మరణం వరకు మనిషికి వైద్యం అండగా ఉంటుంది. మందులు వాడితేనే ఆరోగ్యం మెరుగవుతుంది.

మతం

మతమే మనిషికి నిజమైన తోడు. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి సంపదకు మించి మతాన్ని గౌరవించాలి. మనిషి జీవించి ఉన్నప్పుడే కాదు మరణానంతరం కూడా మతం అండగా ఉంటుంది. మనిషి సన్మార్గంలో నడవడానికి మతం ప్రేరేపిస్తుంది. పుణ్యకార్యాలు చేసేవారు మరణానంతరం కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

Updated Date - 2022-08-03T12:59:18+05:30 IST