Chanakya Niti: భర్తకు భార్య చెప్పని నాలుగు రహస్యాలు... జీవితాంతం అంతే..

ABN , First Publish Date - 2022-08-04T12:27:10+05:30 IST

భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

Chanakya Niti: భర్తకు భార్య చెప్పని నాలుగు రహస్యాలు... జీవితాంతం అంతే..

భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎటుంటి రహస్యాలు ఉండకూడదని చెబుతారు. అయితే భార్య తన భర్తకు చెప్పని నాలుగు రహస్యాల గురించి తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. ఆచార్య చాణక్య అవేమిటో తెలియజేశారు. ఈ రహస్యాల కారణంగా భార్యాభర్తల ప్రేమ మరింత బలంగా ఉంటుందని కూడా ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 

ఏకపక్ష ప్రేమ

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం స్త్రీలలో ఏకపక్ష ప్రేమ ఉంటుందని తెలిపారు. స్త్రీ ఎవరినైనా ఇష్టపడితే ఏకపక్షంగా ప్రేమిస్తుందని చెప్పారు. అయితే ఈ రహస్యాన్ని ఆమె భర్త ముందు బహిరంగపరచదట. ఆమె తన జీవితాంతం ఈ రహస్యాన్ని తనలోనే దాచుకుంటుందని చాణక్య తెలిపారు. 


శృంగార రహస్యం

చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తల మధ్య ఏర్పడే అనుబంధంలో శృంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైనా భర్త తమ సన్నిహిత క్షణాల గురించి అడిగితే ఆమె అరకొరగానే చెబుతుందట. శృంగారానికి సంబంధించి భార్యలకు కోరికలు ఉంటాయని వారు తమ కోరిక, సంతృప్తి గురించి భర్తలకు బహిరంగంగా చెప్పరని చాణక్య తెలిపారు.

డబ్బు ఆదా

భార్య ఇంటికి మహాలక్ష్మి అని ఆచార్య చాణక్యుడు తెలిపారు. ఆర్థిక కుంగుబాటు సమయాల్లో ఇంటిని చక్కదిద్దడంలో వారు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. ఖర్చుల కోసం భర్త ఇచ్చే డబ్బులో కొంతమొత్తాన్ని భార్య పొదుపు చేస్తుంది. అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టదట. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ రహస్యం వెల్లడవుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. 

వ్యాధుల విషయంలో

ఆచార్య చాణక్య పేర్కొన్న ప్రకారం స్త్రీలు తమ జబ్బుల విషయాన్ని భర్తల దగ్గర దాస్తుంటారు. భర్తను అనవసరంగా ఇబ్బంది పెడతామేమోనని వారు ఇలా చేస్తుంటారని చాణక్య తెలిపారు. అయితే వ్యాధులను గోప్యంగా ఉంచడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందని చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-08-04T12:27:10+05:30 IST