Chanakya Niti: ఈ గుప్త ధనాన్ని ఎంత పంచితే.. అంత పెరుగుతుంది!

ABN , First Publish Date - 2022-07-25T17:37:25+05:30 IST

చాణక్య నీతిలో ఆచార్య చాణక్య తెలిపిన వివరాల...

Chanakya Niti: ఈ గుప్త ధనాన్ని ఎంత పంచితే.. అంత పెరుగుతుంది!

చాణక్య నీతిలో ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం మనిషి తన దగ్గరున్న ఈ గుప్త ధనాన్ని ఎంత పంచితే అంత పెరుగుతుంది. ఆ గుప్త ధనమే జ్ఞానం అంటే విద్య అని చాణక్య తెలిపారు. దీనిని ఆచార్య కామధేనువుతో పోల్చారు. కామధేనువు ఎవరు ఏమి అడిగినా ఇస్తుందని, దానిని ఆపి వేయదని చాణక్య తెలిపారు. జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా అది రెట్టింపు అవుతుందన్నారు. తన బిడ్డను అడుగడుగునా రక్షించే తల్లిగా జ్ఞానాన్ని పోల్చాడు చాణక్యుడు. 


జ్ఞానం అంటే విద్య సహాయంతో మనిషి అన్ని కష్టాలను అధిగమిస్తాడు. చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్లేది జ్ఞానం మాత్రమే. ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి దానిని తనవరకే పరిమితం చేసుకోవడం సరికాదు. సమాజ శ్రేయస్సును కోరుతూ ఇతరులతో పంచుకోవడం ద్వారా అది మరింత పెరుగుతుంది. చదువుకోవడం వల్ల ఆ వ్యక్తికి మేలు జరగడమే కాకుండా అనేక తరాల భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందని చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-07-25T17:37:25+05:30 IST