మైనింగ్‌ లీజులు ఇవ్వకూడదు

ABN , First Publish Date - 2020-07-14T10:13:58+05:30 IST

సుప్రీంకోర్డు 1993లో ఇచ్చిన సమతా వర్సస్‌ గవర్నమెంట్‌ తీర్పు ప్రకారం మైనింగ్‌ లీజులు ఇవ్వడానికి ..

మైనింగ్‌ లీజులు ఇవ్వకూడదు

ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చండా ఏలియా


సీలేరు, జూలై 13 : సుప్రీంకోర్డు 1993లో ఇచ్చిన సమతా వర్సస్‌ గవర్నమెంట్‌ తీర్పు ప్రకారం మైనింగ్‌ లీజులు ఇవ్వడానికి వీలులేదని, దీని ప్రకారం ఏపీ జెన్‌కో అప్పట్లో తీసుకున్న 99 సంవత్సరాల లీజు కూడా చెల్లదని ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చండా ఏలియా అన్నారు. సోమవారం మార్కెట్‌ సెంటర్‌లో నిర్వహించిన ఆదివాసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీలేరులో జెన్‌కో నూరు శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే క ల్పించాల్సి ఉన్నప్పటికీ ఈ దిశగా ఉపాధి కల్పించడం లేదన్నారు. ఆదివాసీలు తమ మనుగడ, సామాజిక అభివృద్ధి కోసం దండకారణ్య రాష్ట్రం ఏర్పాటు తప్పనిసరని, భవిష్యత్‌లో దండకారణ్య రాష్ట్రం ఏర్పాటుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని చండా ఏలియా పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు రామారావు దొర, ఎం. రాజుబాబు, కోడా సింహాద్రి,  రీముల పాల్‌, కొర్రా బలరామ్‌, పుష్పరాజ్‌, కొడ ఆనంద్‌ పాల్గొన్నారు. అంతకుముందు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.

Updated Date - 2020-07-14T10:13:58+05:30 IST