ఒక్కేసి పువ్వేసి చందమామ!

ABN , First Publish Date - 2022-09-27T06:26:33+05:30 IST

‘ఒక్కేసి పువ్వేసి చందమామ.., రామ రామనే ఊయాలో..’ అంటూ మహిళల ఆటపాటల మధ్య జిల్లాలో బతుకమ్మ సంబురాలు కొన సాగుతున్నాయి.

ఒక్కేసి పువ్వేసి చందమామ!
టీయూలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రొఫెసర్లు

జిల్లాలో ఆటపాటలతో కొనసాగుతున్న బొడ్డెమ్మ సంబురాలు

రెండో రోజు ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్‌ కల్చరల్‌, సెప్టెంబరు 26: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.., రామ రామనే ఊయాలో..’ అంటూ మహిళల ఆటపాటల మధ్య జిల్లాలో బతుకమ్మ సంబురాలు కొన సాగుతున్నాయి. మహిళల ఆటపాటలతో రెండో రోజు సోమవారం అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగాయి. జిల్లావ్యాప్తంగా బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. రెండవ రోజు బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని మహిళలు బతుకమ్మను రెండు అంతరాలలో పేర్చి అందులో గౌరమ్మను ఉంచి పూజలు చేశారు. గ్రామా ల్లో మొదలుకొని పట్టణాల వరకు మహిళలు ఒక్కో ఇంటి ముందు తమ బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆడారు. అనంతరం తోటి మహిళలతో కలిసివెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేశారు.

మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ

బతుకమ్మ సంబురాల్లో భాగంగా మూడో రోజు  మంగళ వారం మహిళలు బతుకమ్మకు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. బతుకమ్మను మూడు అంతరాలుగా తయారుచేసి ముద్దపప్పు పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు.

బతుకమ్మ సంబరాల్లో ఏడో బెటాలియన్‌

డిచ్‌పల్లి:  బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ ఏడో పోలీస్‌ బెటాలియన్‌ లో వివిధ ప్రాంతాల మహిళలు, యువతులతో ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ సతీమని వివే క వర్ధిని మహిళలతో కలిసి  పూల బతుకమ్మ ను అత్యంత వైభోపేతంగా పేర్చి ఆడిపాడారు. అలాగే, తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహిళ విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను సోమవారం సాయంత్రం టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తా ముఖ్య అతిఽథిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు.  

Updated Date - 2022-09-27T06:26:33+05:30 IST