అభిమానులు ఇలా చేస్తుంటే... చంద్రబాబు ఉద్వేగంగా....

ABN , First Publish Date - 2021-11-20T00:13:40+05:30 IST

తమ అభిమాన నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పట్ల తమ అభిమానాన్ని

అభిమానులు ఇలా చేస్తుంటే... చంద్రబాబు ఉద్వేగంగా....

విజయవాడ: తమ అభిమాన నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పట్ల తమ అభిమానాన్ని, విధేయతను ప్రత్యక్షంగా చూపించారు టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు. ఏపీ శాసనసభలో అవాంఛనీయ పరిణామాలు, భావోద్వేగంగా సాగిన ప్రెస్ మీట్ అనంతరం చంద్రబాబు హైదరాబాద్ వచ్చేందుకు విజయవాడ పార్టీ కార్యాలయం నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు కనిపించిన ఈ దృశ్యం చంద్రబాబును సైతం ఉద్వేగానికి లోను చేసింది. ఆయన రాక గురించి తెలుసుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకుని.... చంద్రబాబు కోసం ఎదురు చూస్తూ మోకాళ్లపై కూర్చుని "సిద్ధం సిద్ధం... పోరాటానికి సిద్ధం.... అంతా నీ వెంటే.... మేమంతా నీవెంటే...." అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొందరు యువ కార్యకర్తలు ఆయనకు పాదాభివందనం కూడా చేశారు. చంద్రబాబు ఒకొక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగారు.

Updated Date - 2021-11-20T00:13:40+05:30 IST