ఆస్ట్రేలియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-04-21T02:54:39+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన

ఆస్ట్రేలియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఇంటర్నెట్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు, నాయకులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు విదేశాల్లోనూ చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 


ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాము నేడు విదేశాల్లో స్థిరపడటానికి చంద్రబాబు ముందుచూపు ఎంతో ఉపయోగపడిందని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అనేక మంది ప్రవాస భారతీయులకు చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తి ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. కాగా.. కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో తాను పుట్టినరోజు వేడుకలను చేసుకోవడం లేదని, తన వద్దకు ఎవరూ రావొద్దంటూ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-04-21T02:54:39+05:30 IST