షార్లెట్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-04-20T22:47:33+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో భారీ ఎత్తున జరిగాయి. ఏప్రిల్ 20న అమెరికా అంతటా తె

షార్లెట్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ఎన్నారై డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో భారీ ఎత్తున జరిగాయి. ఏప్రిల్ 20న అమెరికా అంతటా తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు సమన్వయపరుచుకొని ఈ వేడుకలు నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలలో భాగంగా అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 20 మంగళవారం సాయంత్రం నార్త్ కెరొలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో కూడా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకల కోసం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో టీడీపీ అభిమానులు సమావేశమయ్యారు.


‘హ్యాపీ బర్త్ డే నారా చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం’ నినాదాల నడుమ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా పురుషోత్తం చౌదరి గుడే మాట్లాడుతూ 72 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు పడే తపన, కష్టం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అభిమానులందరూ తమ వంతు ప్రయత్నం చేసి 2024లో టీడీపీ గెలిపించాలన్నారు. సీఎం పదవిని పుట్టిన అసలైన పుట్టిన రోజు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.



అనంతరం దేవరాజు మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ సీఎం అయితే.. ఈ తరానికే కాకుండా వచ్చే తరానికి కూడా మంచి భవిష్యత్తును అందిస్తారని అన్నారు. అలసత్వం వదిలి మేథోమధనం చేయాలన్నారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి ఎలా సహాయం చేయగలం అనే విషయాన్ని ఆలోచించేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమం అనంతరం సభ్యులంతా నారా చంద్రబాబు నాయుడు, అన్న నందమూరి తారకరామారావు ఫోటో బ్యాక్ డ్రాప్‌లో తెలుగుదేశం పార్టీ జండాలు చేతబట్టి ఉత్సాహంగా ఫోటోలు దిగారు. చివరగా వర్కింగ్ డే అయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ఠాగూర్ మల్లినేని కృతఙ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.




Updated Date - 2022-04-20T22:47:33+05:30 IST