
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu)ను మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రశ్నించారు. ‘‘నేను పనికిమాలిన వ్యక్తి అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. పనికి మాలినతనానికి చంద్రబాబుదే పేటెంట్ హక్కు. చంద్రబాబు కంటే పనికిమాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా?.. ఏపీకి సంబంధించి ఒకటైనా పనికొచ్చే విషయం మాట్లాడారా?.. పేదపిల్లలకు అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే.. బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం. బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం తప్పని ఒక్కరితోనైనా చెప్పిస్తారా?.. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయంపై చర్చకు మేం కూడా సిద్ధమే. చంద్రబాబు వస్తారా.. ఆయన తాబేదారులు వస్తారా?’’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి