Telangana ఇంటర్ టాపర్‌కు చంద్రబాబు అభినందనలు

ABN , First Publish Date - 2022-06-30T15:59:34+05:30 IST

తెలంగాణ ఇంటర్ టాపర్, ఎన్టీఆర్ (NTR) మెమోరియల్ కాలేజ్ విద్యార్థిని నిత్యాగౌడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు.

Telangana ఇంటర్ టాపర్‌కు చంద్రబాబు అభినందనలు

అమరావతి: తెలంగాణ ఇంటర్ టాపర్, ఎన్టీఆర్ (NTR) మెమోరియల్ కాలేజ్ విద్యార్థిని నిత్యాగౌడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తిగా స్థాపించబడిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎన్టీఆర్ విద్యాసంస్థలలోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ...  ఇంటర్ ఫలితాలలో మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషకరమన్నారు. ఇంటర్‌లో తెలంగాణ రాష్ట్ర టాప్ ర్యాంకర్‌గా నిలిచిన ఎన్టీఆర్ జూనియర్&డిగ్రీ కాలేజ్ విద్యార్థిని నిత్యాగౌడ్‌కు.. వివిధ గ్రూప్‌లలో మొదటి పది ర్యాంకులలో నిలిచి ఎన్టీఆర్ విద్యాసంస్థల ప్రతిష్టను ఇనుమడింపచేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులకు, ఎన్టీఆర్ విధ్యాసంస్థల అధ్యాపకులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. 


Updated Date - 2022-06-30T15:59:34+05:30 IST