ఏపీ పరిణామాలపై ఢిల్లీలో ఏం చర్చ జరుగుతోంది?

ABN , First Publish Date - 2021-10-24T01:43:47+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ ఖరారైంది. దీంతో సోమవారం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు...

ఏపీ పరిణామాలపై ఢిల్లీలో ఏం చర్చ జరుగుతోంది?

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ ఖరారైంది. దీంతో సోమవారం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను టీడీపీ అధినేత కలవనున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాలని కోవింద్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబు బృందం కలవనుంది.  


ఈ నేపథ్యంలో ‘‘ఏపీ పరిణామాలపై ఢిల్లీలో ఏం చర్చ జరుగుతోంది?. చంద్రబాబు దేశ రాజధానికి వెళ్లాలని ఎందుకు నిర్ణయించారు?. రాష్ట్రపతితో పాటు కేంద్రప్రభుత్వ పెద్దలకు ఏం చెప్పబోతున్నారు?. మోదీ, షాలు వైసీపీ అరాచకాలపై సీరియస్‌గా స్పందిస్తారా?. డ్రగ్స్, గంజాయి పైనే చంద్రబాబు ప్రధానంగా ఫోకస్ పెడతారా?. టీడీపీ అధినేత ఢిల్లీ పర్యటనపై వైసీపీ ఎందుకు కలవరపడుతోంది?. చంద్రబాబు టూర్‌తో రాజకీయ సమీకరణాలు మారతాయా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2021-10-24T01:43:47+05:30 IST