ప్రభుత్వ నిర్వాకంవల్ల Tenth విద్యార్ధుల ఆత్మహత్యలు: Chandrababu

ABN , First Publish Date - 2022-06-10T21:09:24+05:30 IST

ప్రభుత్వ నిర్వాకం వల్ల పదో తరగతి విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

ప్రభుత్వ నిర్వాకంవల్ల Tenth విద్యార్ధుల ఆత్మహత్యలు: Chandrababu

Amaravathi: ప్రభుత్వ నిర్వాకం వల్ల పదో తరగతి విద్యార్ధులు (Tenth grade students) ఆత్మహత్యలు (Suicides) చేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆడుతూ పాడతూ చదువుకోవాల్సిన పిల్లలను.. ప్రభుత్వం చేతకాని తనం వల్ల చంపేస్తారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసేది సామాజిక న్యాయం కాదని.. సామాజిక హత్యలని మండిపడ్డారు. పోలీసుల తీరును ఇక ఊపేక్షించేదిలేదన్నారు. నిబంధనలను ఉల్లంఘించే పోలీసులపై పోరాడతామని స్పష్టం చేశారు.


సీబీసీఐడీ అంటే 41-ఏ నోటీసులివ్వడానికే ఉందా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. సీబీసీఐడీ వేధింపుల డిపార్టమెంటుగా తయారైందని, సీబీసీఐడీ పోలీసులకు.. టెర్రరిస్టులకు తేడా ఉందా..? అని అన్నారు. మఫ్టీలో వచ్చే వాళ్లు సీఐడీ పోలీసులో.. వైసీపీ కార్యకర్తలో తెలీయడంలేదన్నారు. ఇదే పోలీసులు గతంలో టెర్రరిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశారని, ఇప్పుడు నేరస్తులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇష్టమొచ్చినట్లుగా పోలీసులు వ్యవహరిస్తే వదిలిపెట్టేదిలేదన్నారు. పోలీసులను డిక్టేట్ చేసేది డీజీపీ కాదని.. సజ్జలో.. మరో గుమాస్తానో.. అందుకే డీజీపీలు మారినా పోలీసుల తీరు మారడం లేదన్నారు. ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని, పోలీసులు పెట్టే ప్రతి తప్పుడు కేసులపై చర్యలు తీసుకుంటామని, తప్పుడు కేసులపై ప్రైవేట్ కేసులు వేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-10T21:09:24+05:30 IST