
అమరావతి: మద్యం అమ్మకాల ద్వారా కమీషన్ తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులు పెంచుకున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. సీ బ్రాండ్, ఎల్ బ్రాండ్లకు చంద్రబాబు ఎలా అనుమతి ఇచ్చారో రాష్ట్రం అంతా చూసిందని ఆయన ఆరోపించారు. జగన్ ముందుగానే మద్య నియంత్రణ గురించి చెప్పారన్నారు. దానికనుగుణంగానే అధికారంలోకి వచ్చాక 45 వేల బెల్టుషాపులను జగన్ తొలగించారని ఆయన పేర్కొన్నారు. టార్గెట్ పెట్టి మద్యం విక్రయించిన నీచుడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబు అని ఆయన విమర్శించారు. జగన్తో యుద్ధం చేస్తే మీకు రాజకీయ జీవితం లేకుండా చేస్తారని టీడీపీ నాయకులను నాని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి