AP News: వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్‌ విఫలం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-24T18:02:21+05:30 IST

వరద (Flood) బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్‌ విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు.

AP News: వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్‌ విఫలం: చంద్రబాబు

అమరావతి: వరద (Flood) బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్‌ విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ (Jagan) సర్కార్‌పై నమ్మకం కోల్పోవడంతోనే విలీన గ్రామాల్లో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. నీరు, విద్యుత్‌ (Electricity) లేక తీవ్ర ఇబ్బందుల్లో వరద బాధితులున్నారని పేర్కొన్నారు. విలీన మండలాల్లో 14 రోజులుగా కరెంట్‌ సరఫరా లేకపోవడం దారుణమన్నారు. వరద బురదను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. వారం క్రితమే వరదలు తగ్గాయన్న వైసీపీ మంత్రులు.. విద్యుత్ సరఫరా, రాకపోకలు ఎందుకు పునరుద్ధరించలేదు? అని ప్రశ్నించారు. జగన్ సర్కార్‌ నుంచి వరద బాధితులకు సాయం అందకపోవడంతోనే..తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజల ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితికి జగన్‌ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలపై ఎదురుదాడి మాని.. ప్రజల అవస్థలు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పెద్దలు గాలి మాటలు, పర్యటనలు మానుకోవాలన్నారు. వరద బాధితులను యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-24T18:02:21+05:30 IST