దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: కన్నబాబు

ABN , First Publish Date - 2021-10-20T21:00:26+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలకు

దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: కన్నబాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ సీఎం జగన్‌ను దూషిస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారని చంద్రబాబు అంటున్నారని, అదే అమిత్‌షా కాన్వాయ్‌పై దాడి చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-20T21:00:26+05:30 IST