ప్రధాని మోదీకి నా అభినందనలు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-07-13T02:48:21+05:30 IST
రాష్ట్రపతి ఎంపికలో టీడీపీ భాగస్వామ్యం తమ అదృష్టమని టీడీపీ అధినేత చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అమరావతి: రాష్ట్రపతి ఎంపికలో టీడీపీ భాగస్వామ్యం తమ అదృష్టమని టీడీపీ అధినేత చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేద కుటుంబంలో పుట్టిన ముర్ము ఎంతో కష్టపడి పైకొచ్చారని కొనియాడారు. ఎస్టీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఇవాళ విజయవాడలో తాజ్ గేట్ వే హోటల్‌కు చేరుకున్న ముర్ముకు చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్‌గా ముర్ము సేవలందించారని తెలిపారు. ఆదివాసీలు, పేదల అభివృద్ధి కోసం ఆమె కృషి చేసిందన్నారు. ముర్ము నిరాడంబరత చాలా గొప్పదన్నారు. సామాజిక న్యాయం కోసమే ముర్ముకు మద్దత్తు ఇచ్చామన్నారు. సాధారణ పౌరులు అసాధారణ పదవికి ఎన్నిక కావటం మన రాజ్యాంగం విశిష్టత అన్నారు. కేఆర్ నారాయణన్, అబ్దుల్‌కలాం, రామ్నాథ్కోవింద్, ముర్ములు రాష్ట్రపతిగా ఎంపికలో భాగస్వామి కావడం తన అదృష్టమన్నారు.